యాంకర్ సుమ.. దక్షిణాది బుల్లితెరపై యాంకరింగ్ లో లెజెండ్ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా, టీవీ షో అయినా సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. అలాంటి సూపర్ యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయతి’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ జయమ్మ పంచాయతి షూటింగ్ సమయంలో సుమ పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సినిమా షూటింగ్ సమయంలో సుమ చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతి పై నిల్చుని ఉండగా కాలు జారి కింద పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఏమి కాకపోవడంతో అప్పుడు సెట్లో ఉన్న వాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాత వీడియోను మూవీ యూనిట్ ప్రమోషన్ కోసం తాజాగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జయమ్మ పంచాయతి’ సినిమా కోసం సుమ ఇంతలా కష్టపడ్డారా! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.