ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న బుల్లితెర యాంకర్లలో శ్యామల ఒకరు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న శ్యామల.. అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీ ప్రేక్షకులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్యామల.. తాజాగా ఓ అరుదైన ఫీట్ అందుకుంది. యాంకర్స్ అన్నాక టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ మాత్రమే కాదు.. ఖాళీ దొరికితే సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో శ్యామల హవా మాములుగా లేదు. యాంకరింగ్ తో పాటు అడపాదడపా సినిమాలలో మెరిసిన శ్యామల.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్(10 లక్షలు) ఫాలోయర్స్ ని దక్కించుకొని అరుదైన ఫీట్ అందుకుంది.ఈ సందర్భంగా శ్యామల ఇన్ స్టాగ్రామ్ వేదికగా 1 మిలియన్ ఫాలోయింగ్ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఫ్యాన్స్ సపోర్ట్ కి థాంక్యూ చెప్పింది. ఇదిలా ఉండగా.. శ్యామల యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే టీవీ ఆర్టిస్ట్ నరసింహను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం యాంకర్ గా బిజీ లైఫ్ గడుపుతోంది. ఇక శ్యామల కూడా బిగ్ బాస్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటినుండి శ్యామల ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ మార్క్ అందుకుంది. ఇక యాంకర్ శ్యామల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.