Anchor Ravi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రవి. తెలుగులోని అన్ని ఛానల్స్‌లోనూ ఆయన యాంకరింగ్ చేశాడు. యాంకర్ రవిగా కంటే రవి-లాష్యగా చాలా ఫేమస్ అయ్యాడు. జంటగా యాంకరింగ్ చేయటం మానుకున్నాక కూడా ఒక్కడే చాలా షోలు చేశాడు. ఆ షోలలో కామెడీతో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న సమయంలోనే తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్‌తో అతడికి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అన్నా, చెల్లి అని పిలుచుకునేవారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా, ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందని రూమర్లు పాకిపోయాయి. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ఇందుకు ఊతమిచ్చింది. అందులో ఆమె పూలు సర్దుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ వీడియోను ఆధారంగా చేసుకుని నెటిజన్లు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ప్రియాంక సింగ్ పెళ్లి వార్తలపై రవి స్పందించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టాడు. ‘‘ నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పండు మిస్సింగ్ ఉంది. మొదట దాన్ని సెట్ చేయాలి’’ అంటూ కామెడీగా అన్నాడు. ఈ పోస్టుపై ప్రియాంక సింగ్ కామెంట్ చేస్తూ.. ‘‘ ఛీ అన్నయ్య’’ అని పేర్కొంది. మరి, ప్రియాంక సింగ్ పెళ్లి వార్తలకు సంబంధించి యాంకర్ రవి పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) ఇవి కూడా చదవండి : Vishal: 21 కోట్ల రూపాయల అప్పు.. హీరో విశాల్‌పై మండిపడ్డ కోర్టు!