తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన యాంకర్ లలో లాస్య ఒకరు. యాంకర్ రవికి జోడిగా ‘సంథింగ్ స్పెషల్’ టీవీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొంతకాలం ప్రేక్షకులకు దూరమైంది. అయితే చాలా రోజుల తరువాత లాస్య బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఓ టీవీ షో ద్వారా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది లాస్య.
లైఫ్ లో ఏదొక చోట అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు రియలైజ్ అవుతుంటారు. తాజాగా లాస్య అలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా లాస్య తన భర్తతో కలిసి ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ అనే స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో యాంకర్ రష్మీ చేసిన స్కిట్ చూసి లాస్య ఎమోషనల్ అయిపోయింది. రాకెట్ రాఘవ తండ్రిగా, యాంకర్ రష్మీ కూతురి పాత్రలో స్కిట్ చేశారు. అయితే.. తండ్రిని ఎదురించి ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకునే పాత్రలో రష్మీ కనిపించగా.. పరువుకు ప్రాణమిచ్చే తండ్రి పాత్రలో రాకెట్ రాఘవ కనిపించాడు. ఇక స్కిట్ మధ్యలో తండ్రిగా రాఘవ.. ‘పరువు కోసం నేను ప్రాణం ఇయ్యడానికైనా తీయడానికైనా సిద్ధం.. నా గురించి నీకు తెలియదు’ అని కూతురికి గట్టిగా చెప్తాడు.
కూతురు రష్మీ స్పందించి.. ‘నాన్నా.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటా’ అంటుంది. వెంటనే రాఘవ కూతురి అభ్యర్థనకు నో చెప్తాడు. తండ్రి మాటను కాదని.. ‘నాన్న నన్ను అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!’ అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది. ఆ సీన్ చూసి లాస్య చాలా ఎమోషనల్ అయిపోయింది. కంటతడి పెట్టుకొని.. ‘నేను ఇలాగే మా నాన్నని మోసం చేశా. ఈ స్కిట్ చూస్తుంటే మా నాన్నే గుర్తొచ్చారు. మనల్ని ప్రేమించే వాళ్ళను ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా.. అప్పుడు ప్రేమలో ఉంటాం కదా!’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా యాంకర్ లాస్య షో ద్వారా రియలైజ్ అయిన విధానం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.