అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. తెలుగు టాప్ యాంకర్స్ లో ఒకరిగా వెలుగొందుతోంది అనసూయ. తన అందంతో అభినయంతో హీరోయిన్స్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన నటనతో సత్తా చాటుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే, అందంతో అభిమానుల మనసులు దోచుకుంటోందీ ఈ రంగమ్మత్త. ముప్పై పదుల వయస్సులో కూడా తన అందంతో కుర్రకారు మనసులను దోచేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో పలు టీవీ షోల, ఈవెంట్లు చేస్తూనే మరొక పక్క సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అయితే తాజాగా తన భర్త ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న కామెడీ షోలో జబర్దస్త్ ఒకటి. ఇందులు అనేక రకాల స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఒక్కొక్కసారి స్కిట్ లో భాగంగా జడ్జీలపై, యాంకర్ లపై కూడా జోక్స్ వేస్తుంటారు. వారి పాత్రలను ఇమిటేట్ చేస్తుంటారు. ఇటీవల జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. అందులో అనసూయపై ఓ స్కిట్ చేశారు. అందులో భాగంగా అనసూయ భర్త భరద్వాజ్ పాత్రలో దొరబాబు నటిస్తాడు. దీంతో అనసూయ వారి పై కోపం వ్యక్తం చేస్తుంది.” రాముడి లాంటి మా ఆయన క్యారెక్టర్ కి దొరబాబును ఇచ్చారా!.. ఇది ఇప్పుడు ఆపక పోతే చాలా వైలెంట్ అవుద్ది” అని అనసూయ నవ్వుతూ అంటుంది. ఈవీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జీవితంలో తాను పడిన కష్టాలు చెప్పుకొని ఏడ్చేసిన జబర్దస్త్ కొమరం.. భార్యే లేకపోతే..!