సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం, కొద్దిరోజులకే విడిపోవడం చాలా కామన్ అయిపోయాయి. కానీ, పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని.. కొద్దిరోజులు గడిచాక పెళ్లి చేసుకోకుండా విడిపోవడం అంటే.. తెలివిలేని పని అని అందరికీ అనిపిస్తుంది. సరే విడిపోయాక పుట్టిన బిడ్డను పేరెంట్స్ దగ్గర వదిలి.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరగడాన్ని ఏమంటారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ అమీ జాక్సన్ అదేపనిలో ఉన్నట్లు సమాచారం.
మొదట ప్రేమించినవాడితో పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిన అమీ.. అతను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోగానే మరో వ్యక్తితో ప్రేమాయణం స్టార్ట్ చేసేసింది. అదీగాక పాత బాయ్ ఫ్రెండ్ ఫోటోలు డిలేట్ చేసి, కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు అమీ జాక్సన్ కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అమీ జాక్సన్ గురించి ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సౌత్ ఆడియెన్స్ కి.. ఎందుకంటే.. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఎవడు సినిమా చేసింది.
ఇక రోబో 2.o సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. అందుకు కారణం ఆమె తన మొదటి ప్రియుడు జార్జ్ పనాయోటూతో సహజీవనం చేయడమే. వీరికి 2019లో ఓ కొడుకు పుట్టాక నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఊహించని విధంగా కొన్ని నెలలకే పెళ్లి కాకుండా ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తుంది. జార్జ్ తో విడిపోయాక అమీ జాక్సన్..తన సోషల్ మీడియాలో జార్జ్ ఫొటోలన్నింటిని తొలగించింది. జార్జ్ తన కొడుకుతో ఉన్న పిక్స్ కూడా డిలీట్ చేసి షాకిచ్చింది.
తాజాగా అమీ జాక్సన్.. ‘ఎడ్ వెస్ట్ విక్’ అనే హాలీవుడ్ నటుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ బ్రిటిష్ సమ్మర్ ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అమీ కొత్త ప్రియుడితో రొమాన్స్ లో మునిగితేలుతున్న ఫోటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. శృతిమించే విధంగా అమీ కొత్త ప్రియుడితో బెడ్రూమ్ లో ఉన్న పిక్స్, చనువుగా ఉన్న ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. మొత్తానికి పెళ్లి కాకుండా ఓ కొడుకు, కొత్తగా మరో బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ సాగిస్తోంది అమీ. ప్రస్తుతం అమీ జాక్సన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరి అమీ జాక్సన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.