ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న బన్నీ.. సినిమాల తర్వాత ఎక్కువ సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.. ఎల్లప్పుడూ భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. అన్ని విషయాలలో సపోర్ట్ గా ఉంటూ పిల్లలు ఆర్హ, అయాన్ లను చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు బన్నీ ఫ్యామిలీకి సంబంధించి ఏ అప్ డేట్స్ ఉన్నా స్నేహ గారే సోషల్ మీడియాలో ముందుగా పోస్ట్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. బన్నీ – స్నేహారెడ్డిలు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం విదితమే. 2011లో బన్నీ, స్నేహల వివాహం జరిగింది. దాదాపు 11 ఏళ్లుగా బన్నీ – స్నేహల బంధం అటు ఫ్యాన్స్ కి ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. అయితే.. తాజాగా అల్లు స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో భాగంగా బన్నీ, స్నేహాల గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో బన్నీ – స్నేహాల ప్రేమ, పెళ్లి, కట్నంకి సంబంధించి మాట్లాడారు. బన్నీ అసలు కట్నం తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం బన్నీ కట్నం గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.