ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తన నటనతో, అదిరిపోయే డ్యాన్స్ తో టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించారు. “గంగోత్రి” సినిమాతో ఇండస్ట్రీలో అడుపెట్టి.. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల విడుదలైన “పుష్ప” సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు బన్నీ. ఈ సినిమాతో నార్త్ ఆడియన్స్ లో బన్నీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. తన సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్.. కాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అలా ఫ్యామిలీతో సరదగా గడిపిన ఫిక్స్ బన్నీ అభిమానులతో షేర్ చేసుకుంటారు. తాజాగా అలాంటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలావరకు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను ఆమె షేర్ చేస్తుంటారు. దీంతో ఈమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫిక్స్ పోస్ట్ చేసింది. అందులో అల్లు అర్జున్ తో కలిసి తను డేట్ నైట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: స్టేజ్ పై మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన సాయిపల్లవి! వీడియో వైరల్!