బాలీవుడ్ ప్రేమజంట రణబీర్ కపూర్ – అలియా భట్ మూడు ముళ్ల బంధంతో ఈరోజు ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లిపై ఎన్నో రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎట్టకేలకు బీ-టౌన్ స్టార్ జోడీ గురువారం పెళ్లితో ఒక్కటైపోయింది. బాంద్రాలోని రణబీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రణబీర్ – అలియాల వివాహం ఘనంగా జరిగింది.
ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. పెళ్లి పనుల నుంచి మూడు ముళ్ళు పడేవరకు ఈ జంట ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి తర్వాత అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట ఎంతో అందంగా ముస్తాబయ్యారు. పెళ్లి తర్వాత అలియా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
“ఐదేళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈరోజు మాకెంతో ప్రత్యేకం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఏప్రిల్ 16న పెళ్లి రిసెప్షన్ జరగనుంది. మరి రణబీర్ – అలియా జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.