ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్, రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ట్రిపుల్ ఆర్, వరుణ్ తేజ్-వెంకటేష్ నటించిన F3 చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఆసక్తికర కాంబినేషన్ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. అదే యంగ్ హీరో అడవి శేష్, పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు పవన్ కుమారుడు ఇంకా ఇండస్ట్రీలోకి రానేలేదు.. అప్పుడే మల్టీ స్టారర్ గురించి టాక్ ఏంటో తెలియాలంటే.. ఇది చదవండి
విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్.. ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: మేజర్ మూవీ రివ్యూఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ సందర్బంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్, పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాతో తనకున్న అనుభందం గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. ‘‘పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో మీరేమైనా మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశముందా..?’’ అని ప్రశ్నించాడు. అందుకు అడవి శేష్.. ‘‘లేదండీ.. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్.. వారం.. వారం కలుస్తూ ఉంటాం. అకీరా ఇండస్ట్రీకి వస్తాడో, లేదో చెప్పలేను.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. తాను పియానో పై వాయించిన రికార్డ్స్ ను వింటాను. చాలా బాగా వాయిస్తాడు. అప్పుడప్పుడు తాను కొత్తగా రికార్డ్ చేసిన ట్యూన్స్ ను నాకు పంపిస్తాడు.. వాటిని వింటూ నిద్రపోతాను’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Mahesh Babu: సినిమా టిక్కెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు.. ఫోటోలు వైరల్!
‘‘ఇక పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి అని చెప్పను కానీ అదొక గౌరవం. మనసులో నుంచి వచ్చే మర్యాదపూర్వకమైన గౌరవం. నేను ఆయనతో మాట్లాడింది కూడా ఒక నాలుగైదు సార్లు మాత్రమే. ఎప్పుడైనా బర్త్ డే విషెస్ అలాంటివి చెప్తాను. అంతే. అయితే అకీరాతో నేనెప్పుడూ క్లోజ్‌గా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Adivi Sesh: చందమామ సినిమాలో ఒరిజనల్ హీరోని నేనే.. కానీ 2 రోజుల తర్వాత: అడివి శేష్