టాలీవుడ్ ఇండస్ట్రీలో ముప్పైఏళ్ళ వయసు పైబడినా పెళ్లి చేసుకోకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ తో పాటు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. కానీ స్టార్స్ వెలుగుతున్న కొందరు హీరోలు, హీరోయిన్లు.. వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించిన ఇంకొందరు పెళ్లి టాపిక్ తీస్తే దాటవేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొందరు హీరోలు, హీరోయిన్స్ పెళ్లి వైపు అడుగులేస్తున్నారు.
అదీగాక తాజాగా హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఇంకా ఇండస్ట్రీలో బ్యాచిలర్స్ గా మిగిలిపోయిన స్టార్స్ వైపు అభిమానులు, నెటిజన్ల దృష్టి వెళ్తోంది. అందులో భాగంగా యువనటుడు అడివి శేష్ కి సైతం రీసెంట్ గా పెళ్లి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 3న మేజర్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని శేష్ ని ప్రశ్నించగా.. శేష్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు.”ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ ప్రభాస్, అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదు. వాళ్లిద్దరి పెళ్లి జరిగిన తర్వాత నేను చేసుకుంటాను” అని చెప్పినట్లు సమాచారం. అడవి శేష్ వ్యాఖ్యలతో మరోసారి ప్రభాస్, అనుష్కల పెళ్లి టాపిక్ తెరమీదకు వచ్చింది. కానీ వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. నీ పెళ్లి గురించి అడిగితే మధ్యలోకి వాళ్ళను ఎందుకు లాగుతున్నావ్ అంటూ శేష్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అడివి శేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.