నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలనాటి స్టార్ దంపతులు మంజుల- విజయ్ కుమార్ ల పెద్ద కుమార్తె వనితా విజయ్ కుమార్. అయితే తల్లిదండ్రుల చాటు బిడ్డగా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నారు వనితా విజయ్ కుమార్. కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. అవన్నీ విడాకులకే దారి తీశాయి. ఇక తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి : మూడు పెళ్ళిళ్ళూ పెటాకులైనా జీవితానికి ఎదురీదిన వనిత!..
ఈ సందర్భంగా వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మా అమ్మ తన కెరీర్ లో ఎంతో కష్టపడి స్టార్ హోదా సంపాదించుకుంది. మా కోసం, మా భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు షూటింగ్ లంటూ పరుగులు తీస్తూ.. డబ్బులు కూడబెట్టింది. అమ్మకు మేం ముగ్గురం సంతానం. ఏదైనా మాకు సమానంగా రావాల్సిందే. కానీ నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారు. మా అమ్మ చనిపోయాక.. నాకు ఆమె సంపాదించిన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కకూడదనుకున్నారు. అందుకే నా మీద కేసులు పెట్టారు. ఈ విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్లాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : వనితా విజయ్ కుమార్ – నాలుగో పెళ్లి !.. నిజమెంత??.‘‘అయితే నాకు తమిళనాడులో అడ్రస్ లేకుండా చేస్తానని మా నాన్న నాతో చాలెంజ్ చేశారు. కానీ ఇప్పుడు తమిళ ప్రజలకు నేను మరింత దగ్గరయ్యాను. అందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను. నా కుటుంబంలో ఎవరిని అడిగినా.. నేను ఆ కుటుంబంలో లేనని చెప్తుంటారు. వాళ్లకు నా మీద ఎదుకు అంత కోపమో నాకిప్పటకి తెలియదు. ఒకసారైతే.. నాన్న పోలీసులను పిలిపించి.. మా అమ్మ ఇంట్లోంచి నన్ను బయటకు గెంటేపించాడు. నాకు సంబంధించిన వస్తువులు, డబ్బులు అన్ని ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. కట్టుబట్టలతో.. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక పెళ్లి సంగతి అంటారా.. చిన్న వయసులోనే నాకు వివాహం చేయడం వల్లే.. నా పెళ్లిల్లు ఎంతో కాలం నిలవలేవు’’ అని వనిత భావోద్వేగానికి గురయ్యారు. నటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.