స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాలతోనేపాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తెరపై కనిపించినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఫ్యాన్స్ కి పండగే. అయితే.. సాయిపల్లవి గురించి ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఫ్యాన్స్ అందరిలో ఎల్లప్పుడూ కనిపిస్తుంటుంది. తాజాగా సాయి పల్లవి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు తెలిపింది.
తమిళ బ్యూటీ అయినటువంటి సాయిపల్లవి.. తెలుగు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రస్తుతం ప్రోమో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కెరీర్ విషయాలను షేర్ చేసిన సాయిపల్లవి.. “నేను సినిమాల వైపు వస్తాననీ .. హీరోయిన్ ను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమా చేసేటప్పుడు కూడా నేను సీరియస్ గా తీసుకోలేదు. ఆ తరువాత అవకాశాలు పెరుగుతూ ఉండటంతో సినిమాలపైనే దృష్టి పెట్టాను. అవకాశాలు రాని రోజున చేతిలో మెడిసిన్ ఉండనే ఉంది. మొదటి నుంచి కూడా డబ్బు ఇబ్బంది తెలియకుండా మా పేరెంట్స్ పెంచారు.
ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో స్టార్ హీరోయిన్ సోదరుడు!
ఏ వస్తువు అయినా ఎంతవరకూ మనకు అవసరమో ఆలోచన చేసిన తరువాతనే కొనడం జరుగుతుంది. ఇప్పటికీ నేను ఏదైనా కొంటే ఓటీపీ మా అమ్మకు వెళుతుంది. మొదటి నుంచి కూడా ఖర్చు ఏదైనా ఆమె చేతిపై నుంచి జరగడమే అలవాటు’ అంటూ చెప్పుకొచ్చింది. మరి.. సాయిపల్లవి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.