తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని నటి ప్రణీత. “ఏం పిల్లో ఏం పిల్లడో” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత. తనదైన హోమ్లీ లుక్స్‌తో కుర్రోళ్ల మనసు దోచుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. పలు భాషల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.
రీసెంట్ గా ప్రణీత ఓ పోటో షేర్ చేసి.. తను తల్లి కాబోతున్నట్లు అందరికి తెలియజేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన బేబి పంప్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. తాజాగా ప్రణీత జీమ్ లో బేబి పంప్ తో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు.. ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.