గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శకుల, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఒక్క వారంలోనే ఇద్దరు హీరోయిన్లు చనిపోవడం ఎంతో విషాదం మిగిల్చింది. ప్రముఖ నటి పల్లబిడే అనుమానస్పద రీతిలో చనిపోవడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తితో కలిసి కోల్ కతాలోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు.
ఆదివారం ఆమె తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడినట్లు స్థానికులు తెలిపారు. ఆమె స్నేహితుడు షాగ్నిక్ షాపింగ్ చేసుకొని అపార్ట్ మెంట్ కి వచ్చే సమయానికి ఆమె ఉరి వేసుకుని దూలానికి వేలాడుతు ఉండటాన్ని అతను చూశాడు. విషయం పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం పంపించారు. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ప్రాధమిక విచారణలో తెలిసినట్లు పోలీసులు తెలిపారు. నటి పల్లబిడే చనిపోవడానికి కారణం ప్రేమ వ్యవహారమా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఆమె నటించిన టీవీ సీరియల్స్ బాగా పాపులర్ కావడంతో వెండితెరపై కూడా మంచి చాన్సులు వస్తున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం పై అభిమానులు, సహ నటులు విచారం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటి అకాల మరణంతో ఆమె అభిమానులు షాకింగ్ కు గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.