సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక అటు వృత్తిపరమైన విషయాలను, ఇటు వ్యక్తిగత విషయాలను అభిమానులకు ఈజీగా చేరవేయగలుగుతున్నారు సినీ సెలబ్రిటీలు. అది శుభకార్యమైనా, బాధాకరమైన న్యూస్ అయినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే షేర్ చేస్తున్నారు. తాజాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువనటుడు సుధాకర్ కోమాకుల.. తండ్రైన శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
ఈ గుడ్ న్యూస్ షేర్ చేస్తూ.. పుట్టిన బాబు పేరును కూడా రివీల్ చేసాడు సుధాకర్. “ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మే 14న అమెరికాలోని చికాగోలో బాబు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అలాగే మా బాబుకి మహాశివుడి పేరు కలిసొచ్చేలా ‘రుద్ర’ అని నామకరణం చేసాం” అంటూ సుధాకర్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశాడు. అదే విధంగా తన భార్య, బాబుతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశాడు.ప్రస్తుతం సుధాకర్ షేర్ చేసిన ఫ్యామిలీ పిక్ వైరల్ అవుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో సుధాకర్ ఫ్యామిలీని విష్ చేస్తూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. సుధాకర్ చివరిగా క్రాక్, రాజా విక్రమార్క సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం అతని చేతిలో సినిమాలేవీ లేవని సమాచారం. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్.. ఆ తర్వాత కుందనపు బొమ్మ, నువ్ తోపురా సినిమాల్లో హీరోగా కనిపించాడు. మరి సుధాకర్ గురించి మీ అభిప్రాయాలఞ్చ కామెంట్స్ లో తెలియజేయండి.