సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా నటుడు. వెండితెరపై విలన్ గా నటించినా రియల్ లైఫ్ లో మాత్రం ఎంతోమందిని ఆదుకుంటూ హీరోగా మారాడు. కరోనాకు ముందు సోనూ సూద్ అంటే పెద్దగా తెలియని వారు ఇప్పుడు ఆయన పేరున గుళ్లు కూడా కట్టించారు. ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే సోనూ సూద్ ఓ యువకుడి ప్రాణాలు కాపాడి మళ్లీ హీరో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మొగాలోని కొట్కాపుర బైపాస్ వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. నిజంగా దేవుడు పంపించినట్లుగానే అదే సమయానికి సోనూ సూద్ అటుగా వెళ్తున్నాడు.
ఇది చదవండి : బేబీ బంప్ తోనే కాజల్ యాడ్! వీడియో వైరల్!
ప్రమాదం జరిగిన కారులో ఓ యువకుడి ఉండటం చూసి తానే స్వయంగా కారులోకి వెళ్లి యువకుడిని బయటకు లాగి ఎత్తుకొని అంబులెన్స్ వద్దకు తీసుకు వెళ్లాడు. ఒక సెలబ్రెటీ హోదాలో ఉన్న సోనూ సూద్ స్వయంగా అక్కడికి రావడం.. యువకుడిని తానే ఎత్తుకొని వేరే కారులోకి ఎక్కించి ఆసుపత్రికి వెళ్లి మరీ దగ్గరుండి అతనికి ట్రీట్ మెంట్ ఇప్పించాడు. ఓ సెలబ్రెటీ హూదాలో ఉండి యువకుడిని తీసుకు వెల్లడం నిజంగా గ్రేట్.. నిజమైన హీరో అంటే నువ్వే సామీ అంటూ నెటిజన్లు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకున్న ఈ రియల్ హీరో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
An accident had happened at Kotkapura bypass in Moga last night.
By Gods grace, As always @SonuSood saved this young boys life. #SonuSood @SoodFoundation #ThanksForSavingAsAlways #SaviourSonuSood @SonuSood #Bollywood #bollywoodactor #ACCIDENTBe Safe & Drive Slow!! pic.twitter.com/42VnGpV7Gw
— Ragalahari (@Ragalahariteam) February 9, 2022