పూనమ్ కౌర్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం నాతిచరామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ లో పూనమ్ కౌర్ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: హగ్ చేసుకొని రియలైజ్ అయ్యానని సుధీర్ పై ఓపెన్ అయిన రష్మీ!
నాతిచరామి సినిమాలో వడ్డీ వ్యాపారి రామకృష్ణ పాత్రలో నటించిన యాక్టర్ సందేశ్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాక్టర్ సందేశ్ గతంలో.. “రామరామ కృష్ణకృష్ణ, మిరపకాయ్, రగడ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక నాతిచరామిలో సందేశ్ నటనకి మంచి మార్కులు పడుతున్నాయి. సినిమా ఆసాంతం నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో సందేశ్ నటనకి విమర్శకుల ప్రశంసలు అందుతుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే సందేశ్ రానున్న కాలంలో మరిన్ని మంచి పాత్రల్లో కనిపించాలని కోరుకుందాం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.