సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్ను మూశారు. రమేష్ మరణ వార్తతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన రమేష్ బాబు ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి సీతారామారాజుగా తొలిసారి తెర మీద కనిపించారు రమేష్ బాబు. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాల్లో బాల నటుడిగా చేశారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’(1987)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు.
ఇది కూడా చదవండి: రమేష్ బాబు మృతి.. మహేష్ కు కడసారి చూపు దక్కెనా?
అయితే రమేష్ బాబు హీరోగా నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినప్పటికి ఆయన కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ముఖ్యంగా సోదరుడు మహేష్ బాబు, తండ్రి కృష్ణతో కలిసి నటించిన పోరాటం సినిమా తర్వాత ఆయన కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాకపోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ గారు మాట్లాడుతూ.. ‘‘పోరాటం సినిమాలో మహేష్ బాబుతో పాటు రమేష్ బాబు కూడా నటించాడు. ఆ సినిమా తర్వాత దాసరి నారాయణ రావు దర్వకత్వంలో వచ్చిన బ్లాక్ టైగర్ చేశాడు. ఆ తర్వాత తన కెరీర్ లో కొన్ని బ్యాడ్ సబ్జెక్ట్స్ పడ్డాయి. దాంతో రమేష్ కు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఆ తర్వాత హీరోగా వదిలేసి.. నిర్మాతగా మారాడు. ఇక రమేష్ కు బయట జనంలో కలవడం ఎక్కువగా ఇష్టం ఉండదు’’ అన్నారు. కృష్ణ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.