ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీని సౌత్ సినిమాలే ఏలుతున్నాయని చెప్పాలి. బాహుబలి మొదలుకొని ఇటీవల విడుదలైన RRR, KGF సినిమాలు వరకు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే గొప్పదని.. సౌత్ సినిమాలను చిన్నచూపు చూసిన వాళ్లందరికీ సౌత్ పాన్ ఇండియన్ సినిమాలన్నీ బుద్ధి చెబుతున్నాయని ప్రముఖ నటుడు జీవీ సుధాకర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు జీవీ సుధాకర్ నాయుడు బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “హిందీలో వాంటెడ్, రాంబో రాజ్ కుమార్ సినిమాలు చేసేటప్పుడు బాలీవుడ్ వాళ్ళకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలు తెలియదు. అన్నింటిని సౌత్ ఫిలిమ్స్ అనేవారు. అలాగే మీకు సపరేట్ క్యారవాన్స్ ఉంటాయా? సౌత్ లో అందరూ ఇలాగే నల్లగా ఉంటారా? సాంబార్ రైస్ పెడతారంట కదా? అని చిన్నచూపు చూసేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయ్యిందో.. కామెంట్ చేసి కళ్ళు తెరుచుకున్నాయి.
కేజీఎఫ్, పుష్ప, బాహుబలి 2, కేజీఎఫ్-2 వచ్చాయి భయపడిపోయారు. ఇప్పుడు ఏకంగా 22 సౌత్ సినిమాల రీమేక్ రైట్స్ కొనుక్కొని బాలీవుడ్ లో రీమేక్ చేసుకుంటున్నారు. ఏ హీరో అయితే సౌత్ మూవీస్ పై కామెంట్స్ చేశాడో.. మొన్న కేజీఎఫ్-2 అనే సౌత్ సినిమా రిలీజ్ అవుతుందని తన సినిమా పోస్టుపోన్ చేసుకున్నాడు. ఇప్పుడు మనమే సౌత్ సినిమాలు చూశారా? అని అడుగుతున్నాం.. మీరు చేయొచ్చు కదా అంటే.. వాళ్ళ దగ్గర సమాధానం లేదు” అంటూ జీవీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి జీవీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలుయజేయండి.