పిల్లలు పుట్టగానే కాదు.. వారు పెరిగి ప్రయోజకులై జనాల చేత గుర్తించబడినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారని పెద్దలమాట. ప్రస్తుతం ఈ అనుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు సినీ నటుడు, కమెడియన్ ఆలీ. మరి ఆయన ఆనందానికి కారణం ఏంటంటే.. కూతురు ఫాతిమా రమీజున్. ఆలీకి ముగ్గురు పిల్లలన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఆడపిల్లలు ఫాతిమా రమీజున్, జుబేరియా.. అబ్బాయి మహమ్మద్ బాషా. సినిమాలు, షూటింగ్స్ లేకపోతే ఆలీ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు.
ఇటీవలే ఆలీ సతీమణి జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన కూతురు ఫాతిమా గురించి ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు. అదేంటంటే.. కూతురు ఫాతిమా డాక్టర్ అయ్యిందట. అయితే.. డాక్టర్ అవ్వాలనేది అలీ కోరిక అని.. తన కూతురి ద్వారా ఆ కోరిక తీరిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ విషయంపై కూతురు ఫాతిమా కూడా గర్వంగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా ఆలీ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.