సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని కొంతకాలంగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన వార్తలను ఇంతకాలం అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి అలా చేయకుండా ఏకంగా నిశ్చితార్థం చేసుకొని వార్తల్లో నిలిచారు.
తెలుగువాడైన ఆది పినిశెట్టి డిఫెరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో ఆదికి మంచి పేరుంది. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వేరే సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. కెరీర్ పరంగా ఫామ్ లో ఉన్న ఆది.. హీరోయిన్ నిక్కీ గల్రాని మెడలో మూడు ముళ్ళు వేసేందుకు రెడీ అయిపోయాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ప్రైజ్ చేశారు.
ప్రస్తుతం ఆది, నిక్కీ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ సెలబ్రిటీ కపుల్ కి ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. మరకతమణి మూవీ టైంలో ఇద్దరి మధ్య లవ్ మొదలైనట్లు తెలుస్తుంది. ఇక ఎంగేజ్మెంట్ సందర్భంగా.. జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైన విషయమని.. ఎంగేజ్మెంట్ 24న అయిపోయింది అని ఆది చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆది – నిక్కీ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.