83.. ఇంగ్లాండ్లో జరిగిన 1983 క్రికెట్ ప్రపంచ కప్ ని వెండితెరపై రీ క్రియేట్ చేస్తూ తీసిన ఓ స్పోర్ట్స్ డ్రామా. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించాడు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
83 మూవీ కథ అందరికీ తెలిసిందే. 1983 వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ ఎలా విశ్వ విజేతలుగా నిలిచారు? ఈ క్రమంలో భారత జట్టుకి ఎదురైన పరిస్థితులు ఏమిటి? కపిల్ దేవ్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ జట్టు ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎలా ప్రపంచ కప్ ని ముద్దాడిందన్నదే ఈ చిత్ర కథ. చూడటానికి, చదవడానికి ఇది ఓ సింపుల్ స్టోరీనే. కానీ.., మన దేశంలో క్రికెట్ అనే కొత్త మతాన్ని పుట్టించిన ఈ ప్రస్థానాన్ని ఓ కథగా కాకుండా, ఎన్నో భావోద్వేగాల సమ్మేళనంగా చూస్తే మాత్రం కళ్ళతో పాటు, గుండె కూడా చెమర్చక మానదు.
విశ్లేషణ:
ఓ అద్భుతం జరగడం ఎంత కష్టమో.. ఆ అద్భుతాన్ని వెండితెరపై పర్ఫెక్ట్ గా రీ క్రియేట్ చేయడం కూడా అంతే కష్టం. దర్శకుడు కబీర్ ఖాన్ ఈ అసాధ్యాన్ని చాలా గొప్పగా సుసాధ్యం చేసి చూపించారు. ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో వరల్డ్ కప్ ఆడటానికి వెళ్లిన సమయంలో ఆటగాళ్లకి సరైన సదుపాయాలు లేవు. ఆటగాళ్ల రోజు వారీ ఖర్చులకి బోర్డు కేవలం 15 డాలర్లు మాత్రమే చెల్లించింది. ప్లేయర్స్ కి షూస్ కూడా సరిగ్గా ఉండేవి కావు. జట్టు సభ్యులు తమ బట్టలు తామే ఉతుక్కోవాల్సిన దుస్థితి. అప్పుడు టీమ్ ఎదుర్కొన్న ఈ కష్టాలన్నింటినీ 83 మూవీలో కళ్ళకి కట్టినట్టు చూపించారు దర్శకుడు. ఇలాంటి స్థితిలో ఇంగ్లాండ్ కి బయలుదేరిన జట్టుపై ఎవ్వరికీ నమ్మకాలు ఉండవు. దేశంలోని క్రికెట్ మేధావులు మాత్రమే కాదు, బ్రిటీష్ మీడియా సైతం ఇండియన్ క్రికెట్ టీమ్ ని అవమానిస్తూ ఉంటుంది. కానీ.., టోర్నీలో ప్రధాన మ్యాచ్ లు మొదలయ్యాక మాత్రం లెక్కలు మారిపోతాయి.
ఇది కూడా చదవండి : కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై స్పందించిన లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్
మొదటి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ని ఓడించడంలో యశ్ పాల్ శర్మ పోరాటం, రెండో మ్యాచ్ లో మదన్ లాల్ బౌలింగ్ విన్యాసాలని సరిగ్గా రీ క్రియేట్ చేయగలిగారు దర్శకుడు. ఇక వెస్టిండీస్ తో జరిగిన నాలుగో మ్యాచ్ లో అమరనాథ్ ఒంటి నిండా గాయాలు, వెంగ్ సర్కార్ దవడకి 7 కుట్లు పడటం వంటి సన్నివేశాలను క్రికెట్ ప్రేమికుల చేత కన్నీరు పెట్టించేలా తెరకెక్కించారు. ఇక ఎంతో కీలకమైన జింబాంబ్వే మ్యాచ్ లో కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన తీరుని ఆడియన్స్ చేత విజిల్స్ వేసేలా చిత్రీకరించారు దర్శకుడు కబీర్ ఖాన్. ఇక సెమీ ఫైనల్, ఫైనల్ లో హేంద్ర అమర్నాథ్ అద్భుత ప్రదర్శన, వివియన్ రిచర్డ్స్ ని అవుట్ చేసిన కపిల్ దేవ్ క్యాచ్ ఇలా అన్నిటినీ దర్శకుడు పూర్తిగా కవర్ చేయడం విశేషం.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు:
కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. స్క్రీన్ పై మొదటి 5 నిమిషాలు మాత్రమే ప్రేక్షకుడికి రణవీర్ కనిపిస్తాడు. టీమ్ జర్నీ స్టార్ట్ అయ్యాక.. ఈ స్పోర్ట్స్ డ్రామాలో స్వయంగా కపిల్ దేవే నటిస్తున్నాడా అన్న విధంగా రణవీర్ నటించాడు. ఇక అప్పటి ఓపెనింగ్ బ్యాట్సమెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన జీవా అదరగొట్టాడు. టీమ్ మేనేజర్ పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి, కపిల్ భార్య పాత్రలో నటించిన దీపికా పదుకునే వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. వీరు మాత్రమే కాదు, మిగతా ఆటగాళ్లగా నటించిన ప్రతి యాక్టర్ ఆయా పాత్రలలో ఒదిగిపోయారు. ఇక టెక్నీకల్ గా 83 మూవీకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కెమెరా మేన్ గా మిశ్రా.. రియల్ క్రికెట్ ఫీల్ వచ్చేలా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ నుండి ఎడిటింగ్ వరకు అంతా 83కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అన్నీ విషయాలను అద్భుతంగా హ్యాండిల్ చేసి, ఓ గొప్ప అవుట్ ఫుట్ రావడానికి కారణమైన దర్శకుడు కబీర్ ఖాన్ ని మెచ్చుకోకుండా ఉండలేము.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్:
చివరి మాట:
“83”.. కప్ గెలిచిన వీరుల కథ మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసులు గెలిచే సినిమా కూడా.