జోస్ బట్లర్.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ పేరునే జపిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్లో జోస్ బట్లర్ ఓ సూపర్ స్టార్ అనే చెప్పాలి. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేసి ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. క్వాలిఫయర్- 2 మ్యాచ్ వరకు ఈ సీజన్లో.. 4 సెంచరీలు, 4 అర్థ శతకాల సాయంతో మొత్తం 824 పరుగులు చేశాడు. ప్రతి కీలక మ్యాచ్ లో రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లక్కీ స్టార్ గా మారాడు. అయితే ఇప్పుడు ఈ పొగడ్తలు, అవకాశాలు ఉన్నాయి గానీ, ఐదేళ్ల క్రితం బట్లర్ పరిస్థితి ఇది కాదు. అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు.
జోస్ బట్లర్ గడిచిన నాలుగేళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా మారాడు. ఇప్పుడంటే స్టార్ ప్లేయర్ అని అందరూ కీర్తిస్తున్నారు. కానీ, ఒకప్పుడు టీమ్లో ఏడో, ఎనిమిదో ప్లేయర్ గా వచ్చి ఫామ్ లో లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత తనని తాను నిరూపించుకుని ఇప్పుడు ఇంగ్లాండ్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లోనూ స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఐతే దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నారంటూ చెబుతున్నారు. ఆమె వల్లే జోస్ బట్లర్ ఇప్పుడు ఈ స్థాయిలో రాణించగలుగుతున్నాడు అని కామెంట్ చేస్తున్నారు.
ఆమె మరెవరో కాదు.. అతని భార్య లూయిస్ బట్లర్. అవును, ఆమె బట్లర్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు అని చెబుతున్నారు. అప్పటివరకు కెరీర్ లో సతమతమవుతున్న జోస్ బట్లర్ జీవితంలోకి 2017లో లూయిస్ వెబ్బెర్ అడుగు పెట్టింది. వైవాహిక జీవితం మొదలు పెట్టిన తర్వాత జోస్ బట్లర్ కు బాధ్యత పెరిగింది. లూయిస్ బట్లర్ తనలో ధైర్యం, నమ్మకం నింపింది, ఆటలో స్థిరాత్వాన్ని పెంపొందించుకోగలిగాడు. ఆమె నింపిన స్థైర్యం వల్లే ఇప్పుడు జోస్ బట్లర్ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటూ అతని మిత్రులు కూడా చెబుతుంటారు.
అయితే జోస్ బట్లర్- లూయిస్ వెబ్బర్ 2017 అక్టోబర్ 21న ఓ ప్రైవేట్ వివాహం ద్వారా ఒకటయ్యారు. వీరి పెళ్లికి ఇంగ్లాండ్ క్రికెటర్లు స్టీవెన్ ఫిన్, అలెక్స్ హేల్స్ పెద్దలు(ఉషర్స్)గా వ్యవహరించారు. వీరికి జార్జియా రోజ్, మార్గట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొత్తానికి లూయిస్ వెబ్బర్.. జోస్ బట్లర్ జీవితంలోకి అడుగుపెట్టి అతను ఓ గొప్ప స్టార్ గా ఎదిగేందుకు ఎంతో దోహదపడిందన్నమాట. ఐపీఎల్ 2022 సీజన్లో జోస్ బట్లర్ ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.