సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పర్వాలేదనిపించాడు. ఇక.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిలకడగా ఆడటమే కాకుండా.. బుమ్రా లాంటి బౌలర్ ను సైతం దడదడలాడించాడు. ఈ మ్యాచులో హైదరాబాద్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు రాహుల్ త్రిపాఠిని ఎంపికచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రాణిస్తే.. ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
ఐపీఎల్ టోర్నీ యువ ఆటగాళ్లకు ఒక వరంగా మారుతోంది. ప్రతి సీజన్ లాగే ఈ ఏడాది కూడా పలువురు డొమెస్టిక్ క్రికెటర్లు తమ అసాధారణ ప్రతిభతో మెరిశారు. ఆ లిస్టులో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, హర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు ఉండగా.. అందులో రాహుల్ త్రిపాఠి ఒక్కడు. 2017లో రైజింగ్ సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిపాఠి.. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ (2018, 2019), కోల్ కతా నైట్ రైడర్స్(2020, 2021) జట్లకు ఆడాడు. ప్రతి సీజన్ లోనూ అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నాడు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ లో 17 మ్యాచుల్లో 397 పరుగులు చేశాడు త్రిపాఠి. ఇక ఈ సీజన్ కు ముందు మెగావేలంలో రూ. 8.5 కోట్లకు త్రిపాఠిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులాడిన త్రిపాఠి 393 పరుగుల చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండటం విశేషం.
Very soon we will see Rahul Tripathi in national colours 🙌 pic.twitter.com/SqmvZSPtJk
— CricTracker (@Cricketracker) May 18, 2022
ఇది కూడా చదవండి: IPL 2022 Playoffs: సన్‌రైజర్స్ కి ప్లేఆఫ్స్ ఛాన్స్. ఇలా జరిగితే అద్భుతమే!
త్రిపాఠి బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపించగల సమర్థుడు. నిలకడగా ఆడటమే కాకుండా.. అలవోకగా బౌండరీలు బాధగలడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్.. చెన్నై, ముంబై బాటలో పయనించలేదంటే అందకు కారణం.. రాహుల్ త్రిపాఠినే అని సందేహించకుండా చెప్పొచ్చు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తన బ్యాటింగ్ తో జట్టును కాపాడుతూ వస్తున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున త్రిపాఠి మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. జాతీయ జట్టులో అది విరాట్ కోహ్లీ స్థానం. అయితే ఈ మధ్య కాలంలో కోహ్లీ ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టి20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మకు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
Should Rahul Tripathi get a chance in the upcoming T20I series against South Africa?
📸: IPL/BCCI#IPL2022 | #INDvSA pic.twitter.com/4b98p5F3vZ
— CricTracker (@Cricketracker) May 18, 2022
Mohammad Azharuddin praised Rahul Tripathi’s knock against Mumbai and expects to see him soon in Indian colours when the time is right.#MohammadAzharuddin #Rahultripathi #Hyderabad #IPL2022 #Cricket #CricTracker pic.twitter.com/OwdGqv6pFx
— CricTracker (@Cricketracker) May 17, 2022
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు త్రిపాఠిని ఎంపికచేసే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. ఇక ఆ సిరీస్ లో త్రిపాఠి రాణిస్తే.. అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో కూడా టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తావించడం విశేషం. త్వరలోనే త్రిపాఠి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. మరి రాహుల్ త్రిపాఠి జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి అర్హుడా? కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
‘He should be in the mix’
Ravi Shastri on Rahul Tripathi’s case for an India call 🗣️ pic.twitter.com/ZLGprW7bbH
— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2022
Rahul Tripathi in last 2 IPL Seasons
Innings: 30
Runs: 790
Average: 31.6
Strike Rate: 150.19
4s/6s: 80/30
50s: 5#IPL2022| @rahultripathi pic.twitter.com/2XovVlyfON— S. (@Shardulkar) May 17, 2022