టీమిండియా మాజీ సారథి, రన్ మెషిన్ ‘విరాట్ కోహ్లి‘ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2021 సీజన్‌తో ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లి.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి ఇక కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. భారత జట్టులో అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. ఐపీఎల్ 2022లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపొయిందని, అతడికి విశ్రాంతి అవసరం అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో.. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లో 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. మంగళవారం(ఏప్రిల్ 19) రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో విరాట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. “ఆటగాళ్లు విఫలమైనప్పుడు అనవసర ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి. కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. భారత జట్టులో ఎవరికైనా విశ్రాంతిని ఇవ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే. కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపొయింది. రీఫ్రెష్‌తో రీఎంట్రీ ఇవ్వాలంటే విశ్రాంతి చాలా అవసరం. అది రెండు నెలలలైనా, నెలన్నర రోజులైనా ఫర్వాలేదు” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
— Diving Slip (@SlipDiving) April 19, 2022
Do you agree with Ravi Shastri? 🤔🤔#RaviShastri #ViratKohli𓃵 #ViratKohli #Kohli #RCBvsLSG #PBKSvsDC pic.twitter.com/FpAE2iww6i
— Cricket Addictor (@AddictorCricket) April 20, 2022
ఇది కూడా చదవండి: కెప్టెన్ గా రోహిత్ అట్టర్ ప్లాప్! కోహ్లీని తిట్టిన వారు ఇప్పుడు ఎక్కడ?
కోహ్లి చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ మీద సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇంతవరకు అతడు వంద పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. 17 టెస్టులు, 21 వన్డేలు, 25 అంతర్జాతీయ టీ20లు, 37 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తంగా ఈ వంద మ్యాచ్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడంటే ఎంత దారుణంగా విఫలమవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Virat Kohli always be my favourite❤️
Come back stronger King Kohli 👑#ViratKohli𓃵 #ViratKohli #Virat pic.twitter.com/T2wX6YOhEz— Ashutosh Srivastava (@kingashu1008) April 20, 2022
కోహ్లీ పేలవ ఫామ్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.‘‘సెంచరీ లేకుండా సెంచరీ కొట్టాడు.. నిజంగా కోహ్లి మమ్మల్ని చాలా నిరాశపరుస్తున్నాడు. ఏదేమైనా కోహ్లి భాయ్ మళ్లీ ఫామ్‌లోకి రావాలి. సత్తా చాటాలి. ఇకనైనా బ్యాట్ ఝులిపించాలి’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘కోహ్లి పనైపోయింది. జట్టుకు భారంగా మారకుండా.. యువకులకు అవకాశం ఇచ్చేలా తానే తప్పుకొంటే మంచిది’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో.. కోహ్లి 6402 పరుగుల(5 సెంచరీలు, 42 అర్ధ శతకాలు)తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
Whatever Happens 💔 Your are My King 👑 Virat Kohli #ViratKohli𓃵 pic.twitter.com/TRs4ZIx24S
— Nishbanuuuuuu🥀 (@sahi__mc) April 19, 2022
ఇది కూడా చదవండి: పంచెకట్టులో మెరిసిన CSK ఆటగాళ్లు! కావ్వే ప్రీవెడ్డింగ్ పార్టీలో రచ్చ