ఐపీఎల్ లో ఆర్సీబీ పోరు ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ ఆర్సీబీ నుంచి లాగేసుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ లో ఒక్కసారైనా టైటిల్ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలనుకున్న ఆర్సీబీకి మరోసారి నిరాశే ఎదురైంది. ‘ఈసాల కప్ నమ్ దే’.. అనే ట్యాగ్ లైన్ మరోసారి ట్యాగ్ లైన్ లాగే మిగిలిపోయింది కానీ కల సాకారం కాలేదు. అయితే.. ఈ మ్యాచులో ఆర్సీబీ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నా.. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అందులో ముందు వరుసలో ఉన్నాడు.
మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కటీ లేదు. పూర్తిగా విఫలమయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయజట్టులో స్థానం కోసం తిరిగి పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే.. సిరాజ్ ఐపీఎల్ ప్రదర్శనపై విరాట్ కోహ్లీని సైతం అభిమానులు నిందిస్తున్నారు. ‘సిరాజ్ చెత్త బౌలింగ్ వల్లే.. ఆర్సీబీ ఫైనల్ చేరలేకపోయింది’.. ‘జట్టులో స్తానం లేని ఆటగాడిని వెనకేసుకొచ్చావ్.. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ అభిమానులు విరాట్ కోహ్లీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్ కేవలం 9 వికెటట్లు మాత్రమే తీయగలిగాడు. మొత్తం 51 ఓవర్లు వేసిన సిరాజ్ 10.08 ఎకానమీతో 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక.. రాజస్థాన్ తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచులో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్ 31 పరుగులు సమర్పించుకున్నాడు.
Most Runs Conceded in IPL 2022 by Mohammad Siraj 😳#IPLFinal #RajasthanRoyals #RCBvsRR pic.twitter.com/cc8NdestQo
— Cricket Addictor (@AddictorCricket) May 28, 2022
ఇది కూడా చదవండి: Jos Buttler: ఐపీఎల్ లో బట్లర్ వీర బాదుడుకి కారణం ఈ అమ్మాయే! ఈమె ఎవరంటే?
కాగా.. ఐపీఎల్ లో.. ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎవరకి చేతకాని అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.ఐపీఎల్-2022సీజన్‌లో 30 సిక్స్‌లు ఇచ్చిన సిరాజ్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2018 సీజన్‌లో డ్వేన్ బ్రావో 29 సిక్స్‌లు సమర్పించుకున్నాడు. దీంతో.. సిరాజ్ ప్రదర్శనపై అందరూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
A forgettable season for Mohammed Siraj#IPL2022 pic.twitter.com/UZZfwu7eb4
— ESPNcricinfo (@ESPNcricinfo) May 28, 2022
Three consecutive defeats in IPL playoffs for RCB.
Their search for the first trophy continues💔
📸: IPL/ BCCI#MI #CSK #SRH #KKR #RR #DC #PBKS #RCB #IPL #GT #LSG #IPL2022 #CricTracke #ViratKohli #FafduPlessis pic.twitter.com/eLpnve545p
— CricTracker (@Cricketracker) May 27, 2022
The reactions of players tell us the story of RCB in IPL 2022.
📸: @RCBTweets pic.twitter.com/QK4wnbjuwD
— CricTracker (@Cricketracker) May 28, 2022
RR & GT will play the Grand Finale on 29th May.#RCB #IPL2022 #Cricket #CricTracker #JosButtler #SanjuSamson pic.twitter.com/ciYoiRtTpH
— CricTracker (@Cricketracker) May 27, 2022