ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ‘జోఫ్రా అర్చర్‘ను ముంబై ఇండియన్స్ 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్ ముందే ప్రకటించాడు. ఈ విషయం తెలిసినా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనిపై భారీ మొత్తం వెచ్చించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని, అందుకే తమకు నష్టం వాటిల్లినా ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం అప్పట్లో వివరణ ఇచ్చింది. సీజన్ కు అందుబాటులో ఉంటాడో.. ఉండడో తెలియని ఆటగాడిపై ముంబై 8 కోట్లు వెచ్చించడంపై అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ జోప్రా ఆర్చర్ ను కుక్కతో పోల్చాడు. దానికి అర్చర్ అదిరిపోయే కౌంటరిచ్చాడు.
ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు దారుణ ప్రదర్శన చేసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. ఎప్పుడూ అన్ని జట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ చేరే ముంబై.. ఈసారి మాత్రం అందరికంటే ముందే టైటిల్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ముంబై అభిమానులు యాజమాన్యంపై కాస్త గుర్రుగానే ఉన్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించగల ట్రెంట్ బోల్ట్ ను వదులుకోవడం ఒక కారణమైతే, సీజన్ కు అందుబాటులో ఉంటాడో.. ఉండడో తెలియని జోఫ్రా అర్చర్ పై 8 కోట్లు వెచ్చించడం మరో కారణం. ఈ క్రమంలో ఓ నెటిజన్ “ముంబై ఇండియన్స్ 8 కోట్లు పెట్టి ఓ కుక్కను కొన్నది” అని.. జోప్రా ఆర్చర్ ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దానికి ఆర్చర్ రిప్లై ఇస్తూ.. “యూకే నుండి మరో కుక్కను కొనను..” అని బదులిచ్చాడు. అంటే ఇక్కడే ఆర్చర్ ఉద్దేశ్యం.. ఆ కామెంట్ చేసిన నెటిజన్ తనకు ఇకపై కుక్కగా ఉంటాడని అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Never getting a dog from the uk again
— Jofra Archer (@JofraArcher) May 13, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ గెలవాలని RCB ఫ్యాన్స్ ప్రార్థనలు
2019 వన్డే ప్రపంచకప్ అనంతరం ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయంతో గాయపడ్డాడు. దాంతో 2020లో తన మోచేతికి శస్త్రచికిస్త చేయించుకున్నాడు. శస్త్రచికిస్త కారణంగా 2021లో పూర్తిగా ఆటకు దూరమయ్యాడు. అంతర్జాతీయ మ్యాచులతో పాటు ఎలాంటి లీగ్స్ ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్.. ఐపీఎల్ 2022 కూడా ఆడనని ముందే చెప్పాడు. అయితే ఇది మెగా వేలం కావడంతో.. తన పేరును నమోదు చేసుకున్నాడు. 2 కోట్ల కనీస ధరతో వేలల్లోకి రాగా.. రాజస్థాన్, హైదరాబాద్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. హైదరాబాద్ అగట్టిపోటి ఇచ్చినా ముంబై వెనక్కి తగ్గలేదు. చివరకి 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
Now, All depends on Mumbai Indians#INDvSA #MIvsSRH #IPL2022 pic.twitter.com/RuUv1pJG5p
— Cricket Addictor (@AddictorCricket) May 17, 2022
Delhi Capitals takes Royal Challengers Bangalore’s fourth spot on the updated points table.#IPL2022 pic.twitter.com/mnweZFpqPQ
— CricTracker (@Cricketracker) May 16, 2022