ఐపీఎల్ టోర్నీలో 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఆరుకు ఆరూ ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం ఒక మ్యాచులోనైనా విజయం సాధిస్తే చూడాలన్నా అభిమానుల కోరిక అడియాశగానే మిగులుతోంది. ముఖ్యంగా.. ముంబై ఓపెనర్లయినా రోహిత్ శర్మ, ఇషన్ కిషన్ ఆటతీరుపై అభిమానులు అసహన వ్యకతం చేస్తున్నారు.
గత సీజన్ల వరకు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అంటే.. ఏ అభిమాని అయినా, వాళ్లతో ఏ టీం గెలవలేరు అనేవారు. అయితే.. ఈ సీజన్ లో అది కాస్తా రివర్స్ అయ్యింది. ముంబైతో మ్యాచ్ అంటే.. ఆపోజిట్ టీందే విజయం అనే స్థాయికి దిగజారింది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం ముంబై మేనేజ్మెంట్.. రోహిత్ శర్మను16 కోట్లకు రిటైన్ చేసుకోగా, ఇషన్ కిషన్ ను 15.25 కోట్లకు మెగా వేలంలో దక్కించుకుంది. ఇద్దరవి కలిపి 31.25 కోట్లు. ఇంత భారీగా సమర్పించుకున్నా, అందులో ఆట మాత్రం 10 శాతం కూడా ఆడట్లేరనేది బహిరంగ రహస్యం.
ఇది కూడా చదవండి: పంజాబ్ డ్రెస్సింగ్ రూమ్ లో రచ్చ! ఆటగాళ్లకి సీరియస్ వార్నింగ్!
ఈ సీజన్ లో ఇప్పటివరకు.. 7 మ్యాచులు ఆడిన రోహిత్ 114 పరుగులు చేయగా, అందులో టాప్ స్కోర్ 41. ఇక.. ఇషన్ కిషన్, 7 మ్యాచుల్లో 191 పరుగులు చేయగా, హైయెస్ట్ స్కోర్ 81. ఇంత దారుణంగా ఆడుతున్నారు. వీరి పేలవ ఫామ్ టీం విజయంపై ప్రభావాన్ని చూపుతోంది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నిలకడగా రాణిస్తుండగా, తెలుగు యువ ఆటగాడు తిలక్ వర్మ, బుమ్రా పర్వాలేదనిపిస్తున్నారు.
Rohit Sharma in #IPL2022 so far:
41 (32)
10 (5)
3 (12)
26 (15)
28 (17)
6 (7)
0 (2) – TODAYWhat’s gone wrong for the Indian captain in the tournament this year? pic.twitter.com/qV5tnbX2AR
— ESPNcricinfo (@ESPNcricinfo) April 21, 2022
ఇక.. చెన్నై సూపర్ కింగ్స్(ఏప్రిల్ 21) తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే భారీ షాక్ తగలింది. తొలి ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్లు డకౌట్ గా వెనుదిరిగారు. ముఖేష్ చౌదరి వేసిన తొలిఓవర్ రెండో బంతిని రోహిత్ హిట్ చేయగా.. అది లెగ్ సైడ్‌లో ఉన్న సాంట్నర్ చేతిలో పడింది. అదే ఓవర్లో ఇషన్ కిషన్ కూడా డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్ అయిదో బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టాండ్స్ లో ఉన్న ముంబై అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వీరి ఆటతీరుపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇక మీరు ఆడరా?, ఇక ముంబై గెలవదా? మేము ఇలానే నిరాశతో ఉండాల్సిందేనా? అని ఓకే అయిజర్ కామెంట్ చేశాడు. మరొక యూజర్ ‘ముంబై మేనేజ్మెంట్ 32 కోట్లు వేస్ట్ చేసిందంటూ’ కామెంట్ చేశాడు. మరి వీరి ఆటతీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
OUT!
Rohit Sharma falls on the second ball 😲
👉 https://t.co/W1NGsWtkCu #IPL2022 #MIvCSK pic.twitter.com/8RZieOHSiD
— ESPNcricinfo (@ESPNcricinfo) April 21, 2022
What a start for Chennai 🔥🔥🔥#MIvCSK LIVE 👉 https://t.co/W1NGsWtkCu #IPL2022 pic.twitter.com/OUFQy06USh
— ESPNcricinfo (@ESPNcricinfo) April 21, 2022
Rohit and Kishan got out for duck in first over, they are from MI and that’s there way to pay respect to anyone & everyone named ” Mukesh”.
🤪🤪🤪🤪#MIvsCSK #IPL2022 pic.twitter.com/RYNNbdpxt5— Vishal Merai (@vishal_merai) April 21, 2022
ఇది కూడా చదవండి: CSK జట్టుపై మండిపడుతున్న తమిళ ప్రజలు! ఇంత అవమానమా?