దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమ్మర్ సీజన్ అంటే ఎండలు మండిపోవడం సహజం. అందులోనూ ఐపీఎల్ సమ్మర్ సీజన్ లోనే నిర్వహిస్తుంటారు. అయితే ఎండ వేడిమిని ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులు ముంబై, పుణే వేదికలుగా జరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున ప్రాంతం కనుక.. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. మ్యాచ్‌లు ఎలాగూ రాత్రుళ్లు జరుగుతున్నాయి కాబట్టి.. వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. అయితే ఎండ వేడిమిని ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు మ్యాచ్ కంటే ప్రాక్టీస్ సమయంలోనే ఎక్కువగా చెమటోడ్చాల్సి వస్తుంది. తాజాగా మ్యాక్స్‌వెల్ ప్రాక్టీస్ అనంతరం ఐస్ కంటైనర్‌లో తల పెట్టి నీళ్లతో తడుపుకున్నాడు. ఎండలు భరించలేకనే మ్యాక్సీ ఇలా చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
How to cool off after an intense practice session, @Gmaxi_32 style. 😂🧊 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/MlEJpcGI80
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ గెలవాలని RCB ఫ్యాన్స్ ప్రార్థనలు
గత సీజన్‌లో 500కు పైగా పరుగులు సాధించి సత్తా చాటిన మ్యాక్సీ అదే స్థాయి ప్రదర్శనను ఈసారి నమోదు చేయలేకపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్ 228 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక.. ఆర్‌సీబీ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు 13 మ్యాచులాడగా 7 విజయాలు, 6 ఓటములతో(14 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న ఆర్‌సీబీకి.. అది గెలిచినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ రన్‌రేట్ మైనస్‌లో ఉండడమే. అటు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌లు నాలుగో స్థానం కోసం పోటీపడడం.. ఆయా జట్ల రన్‌రేట్ ప్లస్‌లో ఉండడం వారికి కలిసొచ్చింది. ఒక రకంగా సీజన్‌లో ఆర్సీబీ చేజేతులా తమ ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయినట్లే. ఇక ఆర్‌సీబీ తన చివరి మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
Delhi Capitals takes Royal Challengers Bangalore’s fourth spot on the updated points table.#IPL2022 pic.twitter.com/mnweZFpqPQ
— CricTracker (@Cricketracker) May 16, 2022
A player who personified power hitting, a thorough entertainer and one of the best T20 batters ever to grace the game. 😎💥
THE UNIVERSE BOSS also enters the #RCBHallOfFame. 🤩❤️#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/pviaWpy6wK
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022