దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘బాహుబలి‘ సినిమా అందరకి గుర్తుంది కదా?. ఈ సినిమా మొదటి పార్ట్ చూశాక అందరి మదిలో మెదిలిన ఏకైక ప్రశ్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నపై రెండో పార్ట్ వచ్చేవరకు చర్చ జరిగింది. ఇలాంటి చర్చే.. విరాట్ కోహ్లీ ఫామ్ పై ఏడాది కాలంగా జరుగుతోంది. ‘విరాట్ కోహ్లీ’ ఫామ్ కోల్పోయి పరుగులు చేయట్లేదన్నది వాస్తవం. ఈ క్రమంలో ఎవరకి తోచిన సలహాలు వారు ఇస్తూనే ఉన్నారు. తాజాగా.. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఫామ్ శాశ్వతం కాదని, క్లాస్ మాత్రమే ఆటగాడి ప్రతిభకు కొలమానమని చెప్పిన వార్నర్ భాయ్.. మరో ఇద్దరు పిల్లల్ని కనమని సూచించాడు.
స్పోర్ట్స్ యారి వ్యవస్థాపకుడు సుశాంత్ మెహతాతో ఇంటర్వ్యూ సందర్భంగా వార్నర్.. కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఫామ్ పై విమర్శల నేపథ్యంలో.. మీ స్పందనేంటి? ఇలాంటి పరిస్థితిని మీరు కూడా పేస్ చేశారు. మళ్ళీ తిరిగి పుంజుకున్నారు. ఇలాంటి సమయంలో.. అతడికి మీరిచ్చే సలహా ఏంటి? అన్న ప్రశ్నకు ‘ఏమీ లేదు. మరో ఇద్దరు పిల్లల్ని కని లైఫ్ ని ఎంజాయ్ చెయ్’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.
ఇది కూడా చదవండి: IPL 2022 GT vs PBKS: లివింగ్‌స్టోన్ భారీ సిక్స్.. బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్
‘ఫామ్ అనేది టెంపరరీ.. క్లాస్ ఎప్పటికీ శాశ్వతం. మనం దానిని కోల్పోకూడదు. ప్రపంచంలోని ఏ ఆటగాడికైనా కెరీర్ లో ఇలాంటి ఒక పరిస్థితులు ఎదురవుతాయి. ఈ దశను దాటాల్సిందే. ఈ ఎత్తు పల్లాలు చూడాల్సిందే. కోహ్లి బేసిక్స్ కు కట్టుబడి ఉంటే చాలు. ఫామ్ అనేది పెద్ద విషయం కాదు..’ అని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
విరాట్ – అనుష్క దంపతులకు గతేడాది ‘వామిక’ పుట్టింది. ఇక వార్నర్-కాండీస్ లకు ముగ్గురు ఆడపిల్లలే. పిల్లలంటే వార్నర్ కు చాలా ఇష్టం. తాను చేసే టిక్ టాక్ వీడియోలలో ఎక్కువ భాగం తన పిల్లలతోనే చేస్తుంటాడు. మ్యాచులు లేకుంటే వార్నర్.. పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాడు.