ఐపీఎల్ 2022 సీజన్.. ముంబై ఇండియన్స్ ఏ మాత్రం కలిసి రావట్లేదు. ఐపీఎల్ టోర్నీలో రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్న ముంబై జట్టు.. ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ఆడిన 6 మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. 6కు 6 ఓడిపోయి.. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉంది. ముంబై ఇండియన్స్.. తదుపరి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియోలో సచిన్ తనయుడు స్టన్నింగ్ యార్కర్‌తో బ్యాటర్‌ను క్లీన్ బౌల్ట్ చేశాడు. ‘లక్ష్యం గురితప్పలేదంటే అది అర్జునే’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా జోడించింది. ముంబై ఇండియన్స్.. గురువారం(ఏప్రిల్ 21) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. భారీ ధర పెట్టి పెద్ద పెద్ద ఆటగాళ్లను కొన్నా జట్టుకు కలిసి రావడంలేదు. ఈ క్రమంలో.. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కొన్ని మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇవ్వనున్నదని వార్తలొస్తున్నాయి. నిజానికి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ అరంగేట్రం చేస్తాడని భావించారు. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు సోదరి సారా టెండ్కూలర్ కూడా వచ్చింది. కానీ ఆ మ్యాచులో అవకాశం రాలేదు.
You ain’t missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
The entire Tendulkar family is present at the ground today #IPL2022 pic.twitter.com/zm2E3ZIAdr
— India Fantasy (@india_fantasy) April 16, 2022
ఇది కూడా చదవండి: అన్‌సోల్డ్ ప్లేయర్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్! రేపో మాపో జట్టులోకి..
మరోవైపు.. ముంబై జట్టులో బుమ్రా మినహా అంతా విఫలమవుతున్నారు. డానియల్ సామ్స్ మూడు మ్యాచ్‌లకే పరిమితమవ్వగా.. టైమిల్ మిల్స్ ధారళంగా పరుగులిస్తున్నాడు. ఈ క్రమంలో యార్కర్ ఎబిలిటీ ఉన్న అర్జున్ టెండూల్కర్ చెన్నైతో బరిలోకి దిగడం ఖాయమనే చర్చ మొదలైంది. నెటిజన్లు కూడా ఓ అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ జట్టులో అవకాశం లభిస్తే.. అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
💙 🆚 💛
It. Doesn’t. Get. Bigger. Than. This. 🔥#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvCSK @ImRo45 @msdhoni @ChennaiIPL pic.twitter.com/cVAa7fyVBn
— Mumbai Indians (@mipaltan) April 21, 2022
What!! The hell #MIvsCSK #MumbaiIndians #pollard #DCvsPBKS pic.twitter.com/wmsNWukW32
— Saste_shorts (@SasteShorts) April 20, 2022
Win an @UshaIntl rice-cooker! 🥳
Reply with the Wrong’Un and you could be among the lucky winners to be announced on @UshaPlay tomorrow! 💙
T&Cs: https://t.co/aab6gderaS#OneFamily #DilKholKe #MumbaiIndians #UshaPlay #UshaInternational pic.twitter.com/vALvLxGSUl
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
The secret of 💯 hundreds must be Sara Tendulkar.
I hope she became the cause of 💯 more.
Do it for love if not for justifying your immense talent. pic.twitter.com/Z3oTWksARQ
— Manmohan Singh (@manmohan7beats) April 21, 2022
ఇది కూడా చదవండి: ముంబై VS లక్నో! క్యాచ్ పట్టి నవ్వులు పూయించిన రోహిత్!