టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య.. ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్‌లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది. ఈసారైనా ఆ కోరిక నెరవేరుతుందని అనుకున్నా.. ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలై.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే టోర్నీ పూర్తయ్యాక.. ప్లేయర్లు అందరూ బయో బబుల్‌ని వీడే సమయంలో ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్‌తో కలిసి డ్యాన్స్ చేసింది చాహల్ భార్య. ధనుశ్రీ కొరియోగ్రాఫ్ చేస్తుంటే ముందుగా జోస్ బట్లర్‌తో కలిసి తాను కూడా డ్యాన్స్ చేయడం ఆరంభించిన చాహాల్, ఆ తర్వాత కొద్దిసేపటికి వెయ్యలేక.. పక్కకి వెళ్లి నిల్చుని వారిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. ఎంత డాన్స్ వస్తే మాత్రం.. పక్కన ఇంకొకరు ఉంటే.. నన్ను పట్టించుకోవా అన్నట్లుగా మొహం పెట్టాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ధనుశ్రీ.. ‘పర్పుల్ క్యాప్ విన్నర్, ఆరెంజ్ క్యాప్ విన్నర్ మధ్యలో నేను..’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది.
ఇది కూడా చదవండి: IPL 2022: రాజస్థాన్‌కు అవమానం.. గట్టి కౌంటరిచ్చిన సంజూ శాంసన్ భార్య చారులత!
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం నుంచి జోస్ బట్లర్‌తో సన్నిహితంగా ఉంటూ, అతనితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు చాహాల్. ‘జాస్ అంకుల్’ అంటూ చాహాల్ చేసిన పోస్టు, ‘బట్లర్‌తో కలిసి తాను ఓపెనింగ్ చేస్తానని’.. ‘ఒకవేళ ఓపెనర్‌గా వచ్చి ఉంటే ఈజీగా 1000 పరుగులు చేసేవాడినని’.. ఇలా చాహాల్ చమత్కారిస్తూ చేసిన కామెంట్లు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక.. ఈ సీజన్‌లో రాజస్థాన్ తరఫున వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. బట్లర్.. ఈ సీజన్ లో 863 పరుగుల చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. చాహల్, 27 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ అందుకున్నారు.