ఈ భూమి మీద వెలకట్టలేనిది అమ్మప్రేమ. తన జీవితం మొత్తం పిల్లల బాగుకోసం త్యాగం చేస్తుంది. తాను తినకున్నా పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని అందించాలని ఆరాట పడుతుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి మనస్సు అల్లాడిపోతుంది. అలా తాను కష్టాలు పడుతూ పిల్లలను ప్రయోజకులను చేస్తుంది. అయితే అనుకోని ఘటనలతో బిడ్డలు అర్ధాంతరంగా దూరమవుతుంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ తల్లి గుండె బద్దలై పోతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉదయం విధులకు వెళ్లిన కొడుకు.. సాయంత్రానికి విగత జీవిగా మారాడు. బిడ్డ మరణ వార్తను ఆ కన్నపేగు జీర్ణించుకోలేకపోయింది. కొడుకు మృతదేహం చూస్తూనే ప్రాణాలు వదిలింది. ఈ హృదయ విదారక ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రంలోని నలందా ప్రాంతంలోని షంషేర్ నగర్ అనే గ్రామంలో రామ్, కమాలదేవి అనే దంపతులు ఉన్నారు. వీరికి వినోద్ కుమార్(30) అనే కొడుకు ఉన్నాడు. కమాల దేవికి వినోద కుమార్ అంటే ఎనలేని ప్రేమ. పెద్దవాడైనప్పటికి ఇంకా చిన్నపిల్లాడి మాదిరిగానే వినోద్ చూస్తుంది. అదే గ్రామానికి చెందిన అమరేంద్ర కుమార్ అనే వ్యక్తికి చెందిన కన్ స్ట్రక్షన్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జీతం చాలడం లేదని అక్కడ ఉద్యోగం మానేశాడు. అయితే వాళ్లు జీతం ఎక్కవ ఇస్తామనడంతో మళ్లీ ఇటీవల ఉద్యోగంలో చేరాడు. రోజూ ఉదయం విధులకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. గురువారం కూడా వెళ్లి వస్తాను అని తల్లికి చెప్పి.. వినోద్ ఉద్యోగాని వెళ్లాడు. అయితే సాయంత్రం ఇంటి వద్దకు ఓ అంబులెన్స్ వచ్చింది. అది చూడగానే కమాలదేవి ఏదో కీడు అనిపించింది. చివరకు వినోద్ కుమార్ మృతదేహాన్ని కిందకు దించడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సంతోషంగా విధులకు వెళ్లిన కుమారుడు.. విగత జీవిగా ఇంటికి రావడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. మృతుడి తల్లి అయితే రాత్రంతా ఏడుస్తూనే ఉంది. అయితే శుక్రవారం ఉదయం వినోద్ మృతదేహాన్ని చూస్తూ ఆమె కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో స్థానికులందరూ కన్నీటి పర్యంతమయ్యారు.కంపెనీ యజమాని, సిబ్బంది కలిసి వినోద్ ను కొట్టి చంపారంటూ మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. కొడుకు, తల్లి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: భార్యని చంపాడని 6 నెలలుగా జైల్లో భర్త! కానీ.., ఇంట్లో క్షేమంగా భార్య! ఇదీ చదవండి: అతను కూలీ! ఆమె ఇంజినీర్! ఇద్దరి మధ్య ప్రేమ! అంతలోనే!