స్వీట్ బాక్స్ ఏంటి? స్వీట్ బాక్స్ లో రూ. 54 లక్షలు దొరకడం ఏంటి? 54 లక్షలంటే మాటలా? అసలు స్వీట్ బాక్స్ లో అంత డబ్బు ఎలా పడుతుంది? అని అనుమానాలు కలగడం సహజమే. పోనీ స్వీట్ బాక్స్ కొంటే 54 లక్షలు లాటరీ తగిలిందేమో అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నిజంగానే ఆ స్వీట్ బాక్స్ లో 54 లక్షల రూపాయలు ఉన్నాయి. ఓరి నీదుంప తెగ, నువ్వెక్కడ దొరికావురా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. ముందు మేటర్ చెప్పరా బాబు అని కోప్పడకండి. అక్కడికే వస్తున్నా. స్వీట్ బాక్స్ ఏంటో? ఆ స్వీట్ బాక్స్ లో 54 లక్షల గోలేంటో చెప్పేస్తా. అసలు స్వీట్ బాక్స్ లో అంత డబ్బు ఎవరు పెట్టారు? ఎలా పెట్టారు? స్వీట్ బాక్స్ కొంటే.. ఇయన్నీ వద్దు పాయింట్ కి రా అని మీరంటారని తెలుసు. సరే డైరెక్ట్ మేటర్ లోకి వెళ్ళిపోదాం. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది కదా. ఆ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడు సౌదీ నుంచి ఊపుకుంటూ వస్తున్నాడు. యాజ్ యూజువల్ గా కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేస్తారు కాబట్టి మనోడ్ని చెకింగ్ చేశారు. అయితే ఇడియట్ మూవీలో అలీ ఇసుక పేరుతో మోటార్ సైకిళ్ళని ఎత్తుకెళ్లినట్లు.. ఈ స్మగ్లర్ అక్రమంగా సౌదీ కరెన్సీని స్వీట్ బాక్స్ లో పెట్టి తరలిస్తున్నాడు. రూ. 54 లక్షలు విలువ చేసే సౌదీ కరెన్సీని స్వీట్లు ప్యాకింగ్ చేసే బాక్సులో చుట్టూ ఉండే అంచుల్లో దాచి పెట్టాడు. అయితే ప్రత్యేకించి స్వీట్ బాక్సుల్ని సౌదీ నుంచి తరలించడం ఏంటని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులకి అనుమానం కలిగింది. సినిమాల్లో లాగా ఆఫీసర్లు కామెడీగా ఉండరుగా. దీంతో తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. తొలుత స్వీట్లు మాత్రమే కనబడ్డాయి. అయితే బాక్సు పైన ఉండే మూతలో అట్ట ముక్కల్లో ఆ డబ్బుని దాచి ఉంచాడు. ఒక సౌదీ రియాల్ భారత కరెన్సీలో 21 రూపాయలతో సమానం. ఆ లెక్కన భారత కరెన్సీ ప్రకారం 54 లక్షలు తీసుకురావాలంటే.. ఆ స్మగ్లర్ 2 లక్షల 55 వేల సౌదీ రియాల్ తీసుకొస్తే సరిపోతుంది. ఆ రకంగా ఆ స్మగ్లర్ ఎక్కువ విలువ చేసే పెద్ద నోట్లను స్వీట్ బాక్సులో ప్యాక్ చేసి అందంగా ఇండియా తీసుకొచ్చాడు. చివరికి కస్టమ్స్ ఆఫీసర్స్ కి దొరికిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీడొక్కడే సినిమాలో హీరోలా తెలివిగా స్వీట్ బాక్సులో రూ. 54 లక్షలను ప్యాక్ చేసిన ఈ ఘరానా స్మగ్లర్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది కూడా చదవండి: పరాయి మగాడిపై మోజు పడ్డ భార్య.. పట్టపగలే ప్రియుడితో కలిసి! ఇది కూడా చదవండి: పచ్చని సంసారం! వంట గదిలో భార్య, బెడ్ రూంలో భర్త.. విషయం ఏంటంటే?