Uttar Pradesh: ఈ మధ్య కాలంలో ప్రేమ బెదిరింపులు ఎక్కువయిపోయాయి. తమను ప్రేమించకపోతే ప్రాణాలు తీసుకుంటామని బెదిరించి కొంతమంది యువతీ,యువకులు ప్రేమను పొందాలని చూస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ఈ తరహా బెదిరింపులకు దిగాడు. తాను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోవటంతో చస్తానని బెదిరించాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ అమ్మాయి ఏం చేసిందంటే... పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాకు చెందిన మనోజ్ నేపాలి అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి కూడా తనను ప్రేమించేలా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ నెంబర్ నుంచి ప్రతీ రోజు ఆమెకు ఫోన్ చేసి విసిగించేవాడు. మనోజ్ వేధింపులు తట్టుకోలేక ఆమె అతడి నెంబర్ను బ్లాక్ చేసింది. అయినప్పటికి అతడి వేధింపులు ఆగలేదు. కొత్తకొత్త నెంబర్లనుంచి ఫోన్ చేసి విసిగించటం మొదలుపెట్టాడు. ఓ రోజు ఆ అమ్మాయి నెంబర్కు వీడియో కాల్ చేశాడు మనోజ్. ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. అప్పుడు మనోజ్ తన ప్రేమ విషయాన్ని మరోసారి ఆమెకు చెప్పాడు. ఆమె తనకు ప్రేమా.. దోమా ఇష్టం ఉండవని తేల్చిచెప్పింది. దీంతో మనోజ్ బెదిరింపులకు దిగాడు. ‘నాతో స్నేహంగా ఉండు. ప్రేమించు. లేదంటే నేను నా మణికట్టు నరం కోసుకుని ఆత్మహత్య చేసుకుంటా’ అని బెదిరింపులకు దిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి. ఇవి కూడా చదవండి : Uttar Pradesh: భార్య ఫేక్ డెత్ నాటకం.. భర్తకు 10 ఏళ్ల జైలు శిక్ష!