కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆన్ లైన్ లో మోసాలకు పాల్పుడుతూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణాలు రోజుకో చోట వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కేటుగాడు అమాయకులను క్యాష్ చేసుకుని అమ్మాయినంటూ రొమాంటిక్ గా చాట్ చేస్తూ ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నాడు. ఇతగాడి మోసానికి చిక్కిన ఓ బాధితుడు ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని పేరు కూచికుల సాయకృష్ణారెడ్డి (31). హైదరాబాద్ లోని కేపీహెచ్ కాలనీలో నివాసం ఉంటూ నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే డబ్బులకు కక్కుర్తిపడ్డ ఈ దుర్మార్గుడు ఆన్ లైన్ మోసానికి తెర లేపాడు. ఇక నకిలీ ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా అమ్మాయి పేరుతో రొమాంటిక్ గా చాటింగ్ చేస్తూ యువకులను గాలం వేసుకుంటున్నాడు. ఈ కేటుగాడి వలకు ఇటీవల ఓ అమాయక యువకుడు చిక్కుకున్నాడు. అతనితో మెల్లగా మెల్లగా చాట్ చేస్తూ మత్తెక్కించే మాటలతో, చేష్టలతో పూర్తిగా అతడిని తన వైపుకు తిప్పుకున్నాడు. అక్కడి నుంచి చాట్ చేస్తున్నది నిజంగా అమ్మాయినే అనుకున్నాడు. ఇక ఇంకేముంది.., అతను చేయమన్నవి అన్ని చేశాడు. దీనినే ప్లస్ పాయింట్ గా చేసుకున్న ఈ కేటుగాడు అతడిని నగ్నంగా వీడియో కాల్ చేయమని ప్రేరేపించాడు. దీంతో కాదనకుండా మనోడు కూడా వీడియె కాల్ చేశాడు. బాధితుడు అలా నగ్నంగా వీడియో కాల్ చేయడంతో ఈ దుర్మార్గుడు దానిని స్క్రీన్ రికార్డ్ చేశాడు. అదే వీడియోను చివరికి తిరిగి అతడికే పంపి డబ్బులు పంపాలని, లేకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన బాధితుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సాయకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఆన్ లైన్ మోసాలపై పోలీసులు నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా కేటుగాళ్ల దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన భార్య .. తట్టుకోలేక భర్త ఆత్మహత్య!