దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో పలు భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది.. ఇక ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై […]
గెలవాలంటే చెమట చుక్క చిందించాల్సిందే.. గెలుపు తలుపు తట్టాలంటే.. ఆశయం నెరవేరే వరకు ఆగకుండా పరిగెత్తాల్సిందే! గమ్యం ఏదైనా, మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పట్టుదల ఉంటే ప్రాప్తించని విజయమంటూ ఏదీ ఉండదని నిరూపించింది ఓ మహిళ.. చీరకట్టులో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండుటెండలో ఆమె సాగించిన పరుగు.. కేవలం ఒక ఉద్యోగం కోసం కాదు, తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లి చేసిన అలుపెరగని పోరాటం.. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా సోసో గ్రామానికి […]
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ ఏకంగా రూ.10,000 కోట్ల SME గ్రోత్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. అదేవిధంగా రవాణా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేయడానికి, వాటికి ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల […]
ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్టాండ్ లో మంటలు అంటుకుని ఏకంగా 10 బస్సులు దగ్ధమయ్యాయి. వెంటనే అలెర్ట్ అయిన ప్రయాణికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ముంబై సెంట్రల్ పరిధిలోని అనిక్ బస్ డిపో యార్డులో సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల 45 నిమిషాలకు ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. డిపో యార్డులో బస్సులు పార్క్ చేసి ఉన్న ప్రదేశం నుంచి మొదలైన ఈ […]
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. సామాన్యులపై వంటగ్యాస్ భారం పడకుండా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ రీఫిల్‌పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని రాబోయే ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సబ్సిడీ పొడిగింపుతో పాటు కొత్తగా ఈ పథకం కింద చేరాలనుకునే వారికి సైతం ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. కేంద్రం ప్రకటించిన ఈ లేటెస్ట్ నిర్ణయం వివరాలు ఇప్పుడు చూద్దాం. […]
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులను నిలిపివేయనుంది. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ మొదలపెట్టనుంది. దీని వల్ల లబ్దిదారులు రేషన్ తీసుకోరు. ఇతర ప్రయోజనాలు కూడా పూర్తిగా నిలిచిపోతాయని తెలిపింది.కొంతమందికి కార్డు ఉన్నా సరే రేషన్ తీసుకోవడం లేదు. దీంతో అలాంటివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను ఇనాక్టివ్ చేయనుంది. అంటే వారి కార్డు తాత్కాలికంగా […]
హైడ్రా… ఈ పేరు వినగానే చాలామందికి ఇప్పటికీ బుల్డోజర్లు… కూల్చివేతలు… ఆక్రమణల తొలగింపులే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తే హైడ్రాకు మరో ముఖం కనిపిస్తోంది. అదే… చెరువులను కాపాడే హైడ్రా… ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే హైడ్రా… వరదల ముప్పు నుంచి నగరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న హైడ్రా… హైదరాబాద్‌లో కనుమరుగవుతున్న ఓపెన్ స్పేసెస్‌ను తిరిగి ప్రజలకు అందించే హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ… అంటే హైడ్రా. పేరు […]
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు..ఇక ఆ తర్వాత వచ్చే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను కూడా భక్తశ్రద్ధలతో నిర్వహించాలని ఆశ పడటమే వారి పాలిట మృత్యుశాపంలా మారింది..అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంతోషంగా బయల్దేరిన వారు..శవాలై తిరిగి వచ్చారు.. పండుగ పూట సంతోషంగా ఉండాల్సి ఆ ఇళ్లల్లో విషాదాఛాయలు ఆలుముకున్నాయి.. దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషాదకర ఘటన మహారాష్ట్రల్లో చోటు చేసుకుంది.. వర్ధా జిల్లాకు చెందిన కొందరు భక్తులు, దుర్గా మాత […]
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షి ధోనీతో కలిసి నిన్న భాగ్యనగరం హైదరాబాద్‌కు విచ్చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-34లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ధోనీ దంపతులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే, ఆయన రాక గురించి ముందే తెలుసుకున్న భారీ సంఖ్యలోని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎయిర్‌పోర్ట్ […]
జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటోలోని నలుగురు కీలక కమాండర్ల ముఠాలో మూసా చివరివాడు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఈ మూసాను బుద్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది.తాజా ఎన్‌కౌంటర్‌తో ఆ నలుగురు ఉగ్రవాదుల […]
