ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫుడ్ డెలివరీ సేవలు మాత్రమే కాకుండా.. ఆర్ధిక సేవల విభాగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ క్రెడ్ తో జొమాటో 2020లోనే ఓ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా జొమాటోకి చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలు అందజేస్తుంది. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే పార్ట్ నర్ రెస్టారెంట్లకు రుణాలను అందజేసే అవకాశం ఉంది.
ఈ సేవలకు సంబంధించి ఇంకా పేరును ఖరారు చేయలేదు. తాజా నిర్ణయానికి సంబంధించి రూ.10 కోట్లతో ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అది పూర్తి జొమాటో అనుబంధ సంస్థగానే ఉండనుందని తెలుస్తోంది. అయితే.. ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ నుంచి అనుమతులు ఇంకా రాలేదు. కేంద్ర ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయనున్నట్లు బీఎస్‌ఈకి ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.