దేశీయ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను అందించేందుకు సిద్ధమైంది. దీంతో కస్టమర్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్లను వాట్సాప్ ద్వారా పొందొచ్చని ఎస్బీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఈ సేవలను పొందాలంటే మొదటగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్: మొదట.. మీ మొబైల్ నంబరు నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఖాతా నంబరును టైప్ చేసి 72089 33148 నంబరుకు మెసేజ్ చేయాలి. ఇందుకు.. మీ ఎస్బీఐ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్ నంబర్‌నే ఉపయోగించాలి. లేదంటే మీరు ఈ సర్వీసు పొందలేరు. 90226 90226కు మెసేజ్: ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సేవలను పొందేందుకు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు నుంచి +91 90226 90228కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. అప్పుడు మీకు ఈ కింది విధంగా సమాచారం వస్తుంది. ప్రియమైన వినియోగదారుడా, ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! ఈ దిగువన ఇచ్చిన ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోండి. 1. అకౌంట్ బ్యాలెన్స్ 2. మినీ స్టేట్మెంట్ 3. వాట్సాప్ బ్యాంకింగ్ నుంచి వైదొలగండి మీరు '1' అని పంపిస్తే బ్యాంకు బ్యాలెన్స్, '2' అని పంపిస్తే మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఒకవేళ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అవసరం లేదనుకుంటే 3 టైప్ చేసి వాట్సాప్ సేవల నుంచి వైదొలగొచ్చు. Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP — State Bank of India (@TheOfficialSBI) July 19, 2022 క్రెడిట్ కార్డు కస్టమర్లకూ.. క్రెడిట్ కార్డు కస్టమర్లకూ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వినియోగదారులు అకౌంట్ ఓవర్వ్యూ, రివార్డు పాయింట్లు, చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలకు నమోదు చేసుకోవాలంటే 'OPTIN' అనే సందేశాన్ని 9004022022కు పంపించాలి. మీ రిజిస్టర్డు మొబైల్ నంబర్ నుంచి 08080945040 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బడీ.ఎపి సీ ఫస్ట్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ ద్వారా వివిధ రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.