ఈ మధ్యకాలంలో కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమ ప్రయాణానికి ఎక్కువ శాతం కార్లనే ఉపయోగిస్తున్నారు. కారులో జర్నీ అంటే ఎంతో హాయిగా ఉంటుంది. అదే దూరప్రాంతాలకు అయితే ఇంకా బాగుటుంది. కారు జర్నీలో హాయితో పాటు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. కారులో వెళ్తుంటే సడెన్‌గా రోడ్డుపై వాహనం ఆగిపోవడం, వర్షంలో ప్రయాణిస్తుంటే దారిలోనే కార్ బ్రేక్ డౌన్ కావడం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమయంలోనే "రోడ్‌సైడ్ అసిస్టెన్స్" అనే సర్వీస్ ఆదుకుంటుంది. అసలు రోడ్‌సైట్ అసిస్టెన్స్ అంటే ఏంటీ? ఈ సర్వీస్ ఎలా పొందాలి? ఎలాంటి సేవలు కవర్ అవుతాయి? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇన్స్యూరెన్స్ కంపెనీలు వాహనదారులకు అనేక సర్వీస్ లు అందిస్తుంటారు. అలానే కారు వినియోగదారులకు పలు సర్వీసులను ఇన్స్యూరెన్స్ కంపెనీలు అందిసున్నాయి. వాటిలో కాంప్రహెన్సీవ్ కారు ఇన్స్యూరెన్స్ కవర్ ఒకటి. దీనితో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ కూడా ఇస్తుంది. వాహనదారులు ఈ యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. అయితే ఇందుకోసం అదనంగా కాస్త డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ఎప్పుడైనా దారిలో ఆగిపోయినప్పుడు, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ద్వారా సాయం పొందొచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ సర్వీస్ తీసుకున్నవారు ఎప్పుడైనా ఎక్కడైనా కారు ఆగిపోతే...సాయం కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేయాలి. వారు తమ సహాయకుల్ని స్పాట్ కి పంపిస్తారు. చాలావరకు సేవలన్నీ ఉచితంగా లభిస్తాయి. మరికొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రయాణంలో ఆటంకం ఎదురుకాకుండా ట్యాక్సీ సదుపాయం కల్పిస్తాయి. అవసరమైతే హోటల్లో వసతిని కూడా అందిస్తాయి. దూరప్రాంతాలకు వాహనాల్లో తరచూ వెళ్లేవారికి "రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్" ఆన్ కవర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇన్స్యూరెన్స్ కంపెనీ, లభించే సేవల్ని బట్టి ప్రీమియం రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది. కార్లకు మాత్రమే కాదు, బైకులకు కూడా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం రూ.1,000 లోపే ఉంటుంది. మరి.. ఈ సర్వీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఆకాశంలో విహరించాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్.. రూ. 26కే విమాన ప్రయాణం! ఇదీ చదవండి: Crorepati, SIP: కోటీశ్వరులు కావాలని ఉందా.. అయితే ఇలా చేయండి..!