దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. ఈ ధనా ధన్ లీగ్ స్టార్ట్ అవుతోంది అంటే చాలు.. క్రికెట్ ప్రేక్షకులకు పండుగ వచ్చినట్లే. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించే ఈ లీగ్ మొదలవ్వడానికి ఇక గంటల సమయం మాత్రమే మిగిలివుంది. మార్చి 26 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది.
ఐపీఎల్ మొదలవ్వడానికి ఇక గంటల సమయం మాత్రమే ఉండడంతో.. క్రికెట్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ జియో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. జియో కొత్తగా తీసుకొచ్చిన రూ.555 ప్లాన్‌తో ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లు వచ్చే.. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. గతంలోనూ రూ.555 ప్లాన్ ఉండగా.. ప్లాన్‌ల ధరలు పెంచిన సమయంలో దాని ధర మారిపోయింది. అయితే అప్పటి ప్లాన్‌కు.. ఇప్పుడు తీసుకొచ్చిన దానికి పూర్తిగా మార్పులు జరిగాయి. కొత్తగా జియో ప్రవేశపెట్టిన రూ.555 ప్లాన్‌తో ఏ బెనిఫిట్స్ లభిస్తాయో చూడండి.
ఇది కూడా చదవండి: మనం ఫ్రీగా ఉపయోగించే వాట్సాప్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా?జియో కొత్త రూ.555తో ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 55GB డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు యాడ్ ఆన్ డేటాలా ఈ 55జీబీ పని చేస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 55 రోజులుగా ఉంటుంది. రూ.555 ప్లాన్‌తో 55 జీబీ డేటాతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. సాధారణంగా.. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే ఏడాదికి రూ.499 చెల్లిచాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్లాన్‌తో ఉచితంగా ఇస్తోంది. అలాగే జియో యాప్స్, జియో క్లౌడ్, జియో సినిమా లాంటి జియో యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.
డిస్నీ+ హాట్‌స్టార్ లభించే మరికొన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ. 499 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 601 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 3 జీబీ డేటా(+6 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 659 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 1066 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా(+5 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 3119 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా(+10 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Are you ready for India’s biggest cricket league?
Recharge with Jio Cricket Plans and watch all matches live with 1 year Disney+ Hotstar subscription.Recharge Now: https://t.co/2YyMMpCUOf #JioCricketPlans #Jio #T20 #Cricket pic.twitter.com/2kt8yaXiAP
— Reliance Jio (@reliancejio) March 19, 2022