Bommarillu Play Zone Designers: పిల్లల అల్లరి చేష్టలు, ముద్దు ముద్దు మాటలు ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే.. ఒక్కోసారి వీరి అల్లరి భరించడం మాత్రం చాలా కష్టం అవుతుంది. ఆఫీస్ వర్క్‌లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు, షాపింగ్ సమయాల్లో పిల్లలు పక్కన ఉంటే.. ఇక ఆ పనులు అస్సలు సజావుగా సాగవు. ఇలాంటి సమయాల్లో చిన్న చిన్న పల్లెటూరుల్లో అయితే పిల్లలని చూడటానికి బంధువులు ఉంటారు. మరి జాబ్స్ చేసుకుంటూ మెట్రో నగరాల్లో స్థిరపడ్డ పేరెంట్స్ పరిస్థితి ఏమిటి? కేవలం రెండు గంటలు, మూడు గంటలు సమయానికి కేర్ టేకర్‌ను పెట్టుకోలేరు. అలా అని పిల్లలని ఒంటరిగా వదిలిపోలేరు. అయితే.. ఈ సమస్యకి సమాధానంగా నిలుస్తోంది "బొమ్మరిల్లు ప్లే జోన్". తన స్వీయ అనుభవాలతో.. పిల్లలను ఆకట్టుకునే ప్లే స్ట్రక్చర్‌తో హైదరాబాద్‌లో "బొమ్మరిల్లు ప్లే జోన్" ను స్థాపించారు ఫౌండర్ "విజయలక్ష్మి". ఈ ప్లే జోన్ పిల్లలను బాగా ఆకర్షించడంతో ఆమె ఐడియా సూపర్ సక్సెస్ అయ్యింది. పేరెంట్స్‌కి కూడా "బొమ్మరిల్లు ప్లే జోన్" నచ్చడంతో పిల్లలను ఇక్కడ విడిచి తమ పనులు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. "బొమ్మరిల్లు ప్లే జోన్" విశాలంగా ఉండటమే కాకుండా, పిల్లలకు నచ్చే అన్నీ ఆట వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఇక అన్నిటికి మించి పిల్లల భద్రతకి ఎలాంటి సమస్య ఉండదు. ఈ కారణంగానే ఈ ఐడియా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో.. "బొమ్మరిల్లు ప్లే జోన్" కాస్త "బొమ్మరిల్లు ప్లే జోన్ డిజైనర్స్" అయ్యి.. ఒక బిజినెస్ మాడ్యూల్‌గా తయారైంది. ఇది కూడా చదవండి: Electric Vehicle: గ్రేటర్‌లోని ఆ 14 ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు! ఇప్పుడు బొమ్మరిల్లు గేమ్ జోన్ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మి డిజైనర్‌గా మారి.. ఈ బిజినెస్ ఆలోచన ఉన్న వారికి ఇలాంటి ప్లే జోన్స్ డిజైన్స్ చేసి ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎలాగో ఈ కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ కాబట్టి.. హైదరాబాద్‌లోని అన్నీ ఏరియాల నుండి కమర్షియల్ ప్లే జోన్స్ కోసం, తమ పిలల్ల కోసం చాలా మంది విజయలక్ష్మిని అప్రోచ్ అవుతూ వస్తున్నారు. మీరు కూడా.. ఇలాంటి కమర్షియల్ ప్లేజోన్ను సెటప్ చేసుకొని, బిజినెస్‌లో రాణించాలి అనుకుంటుంటే 9866036363, 9542203731 నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇది కూడా చదవండి: Gautam Adani: తన పుట్టిన రోజున కీలక నిర్ణయం తీసుకున్న గౌతమ్ అదానీ.. రూ.60వేల కోట్లతో..!