శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. ఏ లోపం లేకపోయినా సరే కష్టపడి పని చేయాలంటే బద్దకిస్తారు. ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారు. ఎన్ని మంచి మాటలు చెప్పినా.. జీవితాన్ని మార్చుకోమని సలహా ఇచ్చినా మారరు. పైగా నేటి కాలంలో ఇలా పని చేయడానికి బద్దకించి.. జల్సాలకు అలవాటు పడిన వారు.. నేరాలు చేయడానికి సైతం వెనకాడటం లేదు. ఇక మరికొందరేమో.. తమకు ఎవరు సాయం చేయడం లేదని.. మద్దతు లేదని వంకలు చెప్తూ.. నిరాశతో కుంగిపోయేవారు మరి కొందరు. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి.
పుట్టకతోనే అంగవైకల్యం.. దీనికి తోడు మరో ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అసలు కదలలేని స్థితి. తన పనులు తానే చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి కష్టం దారుణ పరిస్థితిని తట్టుకుని.. బతికేందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి. అలాంటిది ఇతరుల మీద ఆధారపడుకుండా.. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించడం అంటే మాములు విషయం కాదు. ఎంతో పట్టుదల, ధృడ సంకల్పం ఉంటే తప్ప ఆచరణ సాధ్యం కాదు. ఈ లక్షణాలన్ని మెండుగా ఉన్నాయి చంద్రకాంత్‌కు. అందుకే తాను వికలాంగుడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి.. వ్యాపారం ప్రారంభించి.. ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తూ.. అంగవైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. సుమన్ టీవీ అతడిని కలిసి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. దీనిలో చంద్రకాంత్ తన సమస్యలు, తనకు ప్రేరణగా నిలిచిన వ్యక్తులు, వ్యాపారంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు తదితర అంశాల గురించి వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. చంద్రకాంత్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sneha Sirivara: లక్ష జీతం వచ్చే జాబ్ వదిలేసి.. చిన్న ఆలోచనతో నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది!