ప్రతిభకు కొలమానం పెద్ద పెద్ద యూనివర్శిటీల నుంచి తీసుకున్న డిగ్రీలు కాదు.. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు విభిన్నమైన పరిష్కారాలు గుర్తించడం, తక్కువ శ్రమ, ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే ఆవిష్కరణలు చేయడం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లాకు చెందని శ్రీనివాస్.. విద్యుత్ అవసరం లేని.. చెక్క ట్రెడ్‌మిల్ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెగ వైరలయ్యింది.
ఇది కూడా చదవండి: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. చెప్పినట్టుగానే..
శ్రీనివాస్ తయారు చేసిన ట్రెడ్‌మిల్‌పై మొదట కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన వివరాలు చెప్పాలని నెటిజన్లు కోరారు. అప్పటి నుంచి ఆయనపై రీసెర్చ్ మొదలైంది. కేటీఆర్ ట్వీట్ తర్వాత చాలా మంది ప్రముఖులు శ్రీనివాస్ క్రియేటివిటీని అభినందించారు. తాజాగా ఆ జాబితాలో ఆనంద్ మహీంద్రా చేరారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడంలోనూ వెలుగులోకి తీసుకురావడంలో ఆనంద్ మహీంద్రా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఇప్పటికి ఇలాంటి లోకల్ లాటెంట్‌ను చాలా మంది ఆయన ద్వారా వెలుగులోకి వచ్చారు. అలా ఆయన దృష్టి ఇప్పుడు శ్రీనివాస్‌పై పడింది.
ఇది కూడా చదవండి: రైతుకు అవమానం.. తప్పు సరిదిద్దుకున్న మహీంద్రా కంపెనీ..
‘‘ప్రతిదాన్ని వ్యాపారంగా చూసే ఈ ప్రపంచంలో ఎన్నో గంటలు శ్రమకోర్చి, అంకితభావంతో ఈ చెక్క ట్రెడ్‌మిల్‌ని తయారు చేశాడు. నిజానికి దీన్ని ఉడెన్ ట్రెడ్‌మిల్ అనడం కంటే కూడా ఓ కళాకారుడి ఆలోచనకు రూపం అనడం మంచిది. నాకు అలాంటిది ఒకటి కావాలి’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
In a world of commoditised, energy hungry devices, the passion for craftsmanship, the hours of dedicated efforts in hand-making this device makes it a work of art, not just a treadmill. I want one… pic.twitter.com/nxeGh6a2kf
— anand mahindra (@anandmahindra) March 24, 2022
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజనలు ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకల్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో మీకు మీరే సాటి.. మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ ఉందని ఎవరైనా అంటే.. ఈ వీడియో చూపండి.. ఇది కదా మేకిన్ ఇండియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే కళకు, లోకల్ టాలెంట్‌కు తగిన ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.