‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’లో ఏ వారం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ప్రతివారం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. కానీ, ఈసారి తేజస్విది మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇంక ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో వాళ్లు ఇచ్చే ఇంటర్వ్యూ మరో రేంజ్ లో ఉంటుంది. ఇంట్లో వాళ్లపై దాచుకున్న ప్రేమ, కక్ష, పగ అంతా ఆ ఇంటర్వ్యూలో వెళ్లగక్కుతారు. తేజస్వి కూడా అదే చేసింది. ఆమె మెయిన్ టార్గెట్ ఎవరో కాదు.. నటరాజ్ మాస్టర్.
ఇదీ చదవండి: RRR సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమాలానే మేం కూడా!
అవును వాళ్లిద్దరూ హౌస్ లో చాలా మంచి ఫ్రెండ్స్. కిచెన్ టీమ్ లో ఎంతో బాగా కలిసి వంట చేసి ఇంట్లో అందరికీ పెట్టారు. కానీ, ఒక సందర్భంలో నటరాజ్ మాస్టర్– తేజస్విపై అరిచేసి ఎవరినీ ఇన్‌ఫ్లూఎన్స్ చేయకు అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత నుంచి వారి మధ్య పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి బిగ్ బాస్ బజ్ కు వచ్చే వరకు కూడా ఆ వైరం అలానే రగులుతోంది. తేజస్వి మాటల్లో అది బాగా కనిపిస్తుంది. చూసిన ప్రేక్షకులు కూడా అంత పెద్ద వైరం ఏర్పడిందా అని నమ్మలేరు. తేజస్వి మాటల్లో నటరాజ్ మాస్టర్ పై కోపం, చిరాకు, అసహనం ఇలా చాలా ఎమోషన్స్ కనిపించాయి. పైగా ఆయనకు కాట్‌రాజ్ అని కొత్త పేరు కూడా పెట్టింది.
యాంకర్ రవి రాడ్ ఎవరికిస్తావ్ అని అడగ్గా.. నటరాజ్ మాస్టర్ కు పెట్టేసింది. నీకు గన్ ఇచ్చి కాల్చేయ్ అంటే ఎవరిని షూట్ చేస్తావ్ అంటే.. అది కూడా నటరాజ్ మాస్టర్ అనే చెప్పింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘గేమ్ కోసం ఇలా ఆడుతున్నారో.. లేక నిజంగానే మీరు ఇలా ఉంటారో నాకు తెలియదు. కానీ, మీలాంటి ఫాదర్ అయితే నాకొద్దు’ అంటూ తేజస్వి కుండ బద్దలు కొట్టేసింది. ఆయన ఫొటోను చింపి గాల్లోకి ఎగరేసింది. తేజస్వి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నటరాజ్ మాస్టర్ లాంటి ఫాదర్ నాకొద్దు అంటే అది చాలా పెద్ద స్టేట్ మెంట్. మరి తేజస్వి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.