బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎందుకంటే ఈసారి ఛాలెంజర్స్ Vs వారియర్స్ కావడంతో ప్రతి విషయంలో గొడవలు, రచ్చతో బాగా బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ల కంటే ఇంట్లోకి కొత్తగా వచ్చిన జూనియర్లకే ఎక్కువ ఫేమ్ వస్తోంది. వారికే అభిమానులు కూడా పెరుగుతున్నారు. అయితే హౌస్లో ఎంతో హుందాగా గేమ్ ఆడుతున్న మిత్రాశర్మకు ఫ్యాన్ బేస్ పెరిగిందనే చెప్పాలి. అంతే కాదు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు మరింతగా ఫ్యాన్స్ అవుతున్నారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో తనతోనే తిరగాలంటూ బిందుకు యాంకర్ శివ హుకుం!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిత్రా శర్మ ఒక హీరోయిన్, ప్రొడ్యూసర్, అన్నింటికంటే ముఖ్యంగా పెట్ లవర్. తొలి సంధ్యవేళలో అనే చిత్రంతో హీరోయిన్ గా పరియచమైంది. రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శ్రీ పిక్చర్స్ అని నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆమెకు ఇంద్ర భవనంలాంటి ఇల్లు కూడా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిత్రా శర్మ కారు గురించి. ఆమె వాడే కారు విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఆ కారు ప్రత్యేకత ఏంటంటే కార్ల్ బెంజ్ సంతకం ఉంటుంది. అంతేకాదు ఇండియాలో ఈ మోడల్ కార్లు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ లో ఆ మోడల్ కారు మిత్రా శర్మది ఒక్కటే. ఇంక మిత్రా శర్మ ఇంట్లో 10 కుక్కలు ఉన్నాయి. ఆమెకు మూగజీవాలంటే ప్రాణం. ఓరోజు రోడ్డుపై ఓ కుక్కకు ప్రమాదం జరిగి కాలు విరిగింది. అప్పుడు ఆ కుక్కను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. ఆ తర్వాత కుక్కలపై ఇష్టం పెరిగి కొత్తరకం బ్రీడ్లను పెంచుకుంటోంది. వాటికి ప్రత్యేకంగా బెడ్ రూమ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి హౌస్ లో కామ్ అండ్ కంపోస్డ్ గా ఉన్నా కూడా… బయట ఓటింగ్ మాత్రం ఓ రేంజ్ లో పడుతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.