‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్ చేయడంలో బాగానే సక్సెస్ అవుతున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అకట్టుకుంటోంది. ప్రతి విషయానికి టాస్కులు పెట్టడం. వారియర్స్ ఏ అవసరం కావాలన్నా దానికి ఛాలెంజర్స్ పర్మిషన్ కావాలనడం. ఛాలెంజర్స్ కు షో మొదలైనప్పటి నుంచి సీనియర్లే ఒండిపెట్టడం కూడా చాలా గొడవలకు దారి తీస్తోంది. రోజు మొత్తంలో వాళ్లు ప్రశాంతంగా మాట్లాడుకున్న దానికంటే గొడవలు పడటమే ఎక్కువగా ఉంది. వాళ్లళ్లో వాళ్లు గొడవలు పడుతూ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
జూనియర్లలో యాంకర్ శివ, ఆర్జే చైతు, బిందు మాధవి మాత్రం సీనియర్లకు బాగా టార్గెట్ అవుతున్నారు. ఉన్నవాళ్లలో సీనియర్లకు వాళ్లే గట్టిపోటీ కాబట్టి వాళ్లను కంట్రోల్ చేసేందుకు రకరకాల స్ట్రాటజీలు వాడుతున్నారు. అందులో భాగంగా తేజస్వి.. యాంకర్ శివపై ఓ గేమ్ ప్లే చేసింది. మహేశ్ విట్టాకు వచ్చిన సిగిరెట్లను తేజస్వి అడిగి తీసుకుంది. అవి తన దగ్గర పెట్టుకుని యాంకర్ శివను కంట్రోల్ చేయాలని చూసింది. కాకపోతే పొరపాటున ఆ సిగిరెట్లు మళ్లీ యాంకర్ శివకు దొరుకుతాయి.
ఇంకేముంది నా పర్సనల్ వస్తువులు మీరెలా తీసుకుంటారు అంటూ శివపై యుద్ధమే చేసింది. శివనేమో కెమెరాలు చూస్తున్నాయి, జనం చూస్తున్నారు. నేను నీ పర్సనల్ వస్తువులు ముట్టుకోలేదు. అంటూ చెప్పుకొస్తాడు. యాంకర్ శివ సమాధానంతో ఇంకా కోపంతో ఊగిపోయిన తేజస్వి వాల్యూమ్ పెంచేసి కేకలు వేసింది. నా వస్తువులు పట్టుకుంటావా అంటూ రెచ్చిపోయింది. మహేశ్ విట్ట మాత్రం నాకు సంబంధించినవి మీరు ఎవరు తీసుకున్నా నేను మాట్లాడలేదు అంటూ తప్పుకున్నాడు. ఆర్జే చైతు ఈ విషయంపై స్పందించాడు. అలా మనుషుల వీక్ నెస్ తో డీల్సు చేస్తున్నారు అంటాడు. తేజస్వి- యాంకర్ శివ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.