‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి స్మార్ట్ ఫోన్లకు అంటుకునేలా చేస్తోంది. ఇక్కడ ఏం జరిగినా కూడా బయట పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హౌస్ లో జరిగిన షాకింగ్ ఎలిమినేషన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. ఆర్జే చైతు ఎలిమినేషన్లో కుట్ర జరిగిందంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్ లో ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ, మంచి ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చైతు మూడో వారంలోనే ఎలిమినేట్ కావడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్!
బిగ్ బాస్ తెలుగు ఓటీటీని కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభించారు. ఇక్కడ ఒకసారి బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన వారియర్స్, కొత్తగా బిగ్ బాస్ కు వచ్చిన ఛాలెంజర్స్ ఉన్నారు. ప్రతి విషయం వారి మధ్య ఒక టాస్కులా జరుగుతుంది. ఆ క్రమంలో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈసారి హౌస్ లోకి వచ్చిన 17 మందిలో కొందరు ప్రేక్షకులకు సుపరచితులే అయినా కూడా కొందరి ముఖాలు కూడా వారికి తెలీదు. అలాంటి వారితో పోల్చుకుంటే చైతుకు చాలా మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. మొదటి వారం ముమైత్ ఎలిమినేషన్ విషయంలోనే అనుమానాలు లేవనెత్తారు.
ఇప్పుడు ఆర్జే చైతు అనగానే కాస్త సీరియస్ గానే కామెంట్ చేస్తున్నారు. ఛాలెంజర్స్- వారియర్స్ అనే గ్రూపులు విషయం పక్కన పెడితే అందరిలో కాస్త చైతు పేరు ఫేమస్ అనే చెప్పాలి. వారియర్స్ తరఫున వారి గళాన్ని వినిపించే వారిలో చైతు ముందుంటాడు. పేరుకు వారియర్స్ 8 మంది ఉన్నా వారిలో చైతు, శివ, బిందు మాత్రమే ఫోకస్ లో ఉంటుంటారు. అలాంటి చైతు అది కూడా కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎలిమినేట్ కావడాన్ని చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని సభ్యులే ఆ విషయాన్ని నమ్మలేకపోయారు. ఆర్జే చైతు ఎలిమినేట్ అనగానే అందరూ షాకయ్యారు. తనకంటే హౌస్ లో ఇంకా చాలా మంది వీక్ ప్లేయర్లు ఉన్నారంటూ ప్రేక్షకులు సైతం కామెంట్ చేస్తున్నారు. ఆర్జే చైతు ఎలిమినేషన్లో కుట్ర జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.