తెలుగులో బిగ్‌బాస్ ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి కావడంతో.. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీతో ముందుకు వచ్చారు షో నిర్వాహకులు. 24/7 నాన్‌స్టాప్ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం నాటి ఎపిసోడ్లో ‘తలుపుతట్టిన తొలి ప్రేమ’ అంటూ శుక్రవారం వారి వారి తొలి ప్రేమ గుట్టుని బయటకు లాగారు బిగ్ బాస్. దానిలో భాగంగా..తన లైఫ్‌లోని తొలిప్రేమ అనుభవాలను బయట పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ బిందు మాధవి. తన ఫస్ట్ లవ్‌ని బిగ్ బాస్ హౌస్‌లో రివీల్ చేసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ తర్వాత.. మొదటిసారి ఒకే పార్టీలో కనిపించిన సిరి- శ్రీహాన్!
‘‘ఇప్పుడు నేను నా బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పట్లేదు. జస్ట్ ఆర్ అనుకొండి. ఇక నేను ప్రతి రోజు నాన్నతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ బ్యాండ్మింటన్ ఆడటానికి వెళ్లేదాన్ని. అప్పుడు నాకు ఒక స్కూటీ ఉండేది. అక్కడ తను నాకు కనిపించకుండా ఉంటూనే.. నా స్కూటీ మీద ఒక ఫ్లవర్ కానీ, చిన్న బొమ్మ కానీ, చిన్న లెటర్ కానీ వదిలేసి వెళ్లేవాడు. ఇదంతా నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఈ రోజు ఏం పెట్టి ఉంటాడా అని ఎదురు చూసేదాన్ని. అలా మొదలైన ఆ ప్రయాణంలో.. నెమ్మదిగా తన మీద ఇష్టం మొదలయ్యింది. ఇక ఈ దాగుడుమూతలు ఆపి.. తనను కలుసుకోవాలని వెళ్లాను’’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకుంటేగానీ తాను చేసుకోనంటున్న బిగ్ బాస్ ఫేమ్ శ్రీ రాపాక
‘‘ఇద్దరం ఒకరికి ఒకరం బాగా నచ్చాం. ప్రపోజ్ చేసుకున్నాను. ఇక తనతోనే నాకు అన్నీ మొదటి సారి. నన్ను బయటికి తీసుకుని వెళ్లడం.. అప్పటి వరకూ సినిమాల్లో, ఊహల్లో ఊహించుకునే వాటన్నింటిని అతనితో ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పటి వరకు ఇంట్లో తప్ప బయట ఎక్కడా ఎవరి దగ్గరా ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయడం రాని నాకు.. బయట వాళ్ల దగ్గర నా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం వచ్చింది. నా పర్సనాలటీ నాకు అతని ద్వారానే తెలిసిందనిపిస్తుంది. అది నిజంగా గ్రేట్ బాండింగ్. చాలా వరకు ఫస్ట్ లవ్ స్టోరీస్ చాలా వరకూ బ్రేకప్‌తోనే ఎండ్ అవుతుంటాయి. కానీ నా ఫస్ట్ లవ్ స్టోరీలో మంచి విషయం ఏంటంటే.. నేను ఇండిపెండెంట్‌గా ఉండాలని నాకు నేర్పించింది అతనే.. ఇప్పుడు అతను వేరే వాళ్లతో ఉండొచ్చు కానీ.. నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులు మిగిలాయి’’ అని తన ఫస్ట్ లవ్‌స్టోరిని బయటపెట్టింది బిందు మాధవి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నటరాజ్ మాస్టర్ పై తేజస్వి సంచలన వ్యాఖ్యలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.